శీతాకాలంలో వెల్లుల్లి టీ నీ ప్రతిరోజు సేవిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

మనందరికీ ప్రతిరోజు వేడి వేడి టీ మరియు కాఫీ తాగే అలవాటు కచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు కాఫీ, టీలు తాగితే మన ఆరోగ్యానికి కొంత ప్రమాదమే అని తెలిసినప్పటికీ ఎక్కువగానే సేవిస్తుంటాం. అయితే ప్రతిరోజు ఇప్పుడు చెప్పబోయే పానీయాన్ని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. యాంటీ మైక్రోబియన్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండే వెల్లుల్లి మన రోజువారి ఆహారంలో తీసుకోవడంతో పాటు వెల్లుల్లి టీ ని ప్రతిరోజు సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, వెల్లుల్లి టీ ని ఎలా తయారు చేసుకోవాలి వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా రుచికరమైన వెల్లుల్లి టీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గిన్నెలో నీటిని తీసుకొని అందులోకి అల్లం మరియు వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు మరగనిచ్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టుకుని వచ్చిన మిశ్రమంలోకి తగినంత తేనె నిమ్మ రసాన్ని జోడిస్తే రుచికరమైన సువాసన భరితమైన వెల్లుల్లి టీ తయారైనట్లే. వెల్లుల్లి పానీయాన్ని ప్రతిరోజు సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ మైక్రోబియన్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే దగ్గు, జ్వరం, ఫ్లూ, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను అదుపులో ఉంచవచ్చు.

అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు వెల్లుల్లి టీ ని సేవిస్తే సహజసిద్ధంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు. అలాగే ఈ పానీయంలో సమృద్ధిగా లభించే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని చెడు మలినాలను తొలగించి శ్వాస వ్యవస్థను,రక్త ప్రసరణ వ్యవస్థను,జీర్ణ వ్యవస్థను, నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చలికాలంలో అధికంగా ఇబ్బంది పెట్టే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గించి గుండెపోటు, రక్తపోటు ముప్పును తగ్గిస్తుంది.
వెల్లుల్లి, అల్లంలో ఉండే సహజ ఔషధ గుణాలు రక్తంలో చక్కెర నిల్వలను తగ్గించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడు చురుకుదనాన్ని ,జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.