మీ పిల్లల తరచూ దగ్గు రొంపు సమస్యతో బాధపడుతున్నారా…. ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి!

సాధారణంగా వాతావరణంలో మార్పులు వస్తే చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లల విషయంలో శీతాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. చిన్నపిల్లలు చాలా తొందరగా దగ్గు జలుబు వంటి సమస్యల బారిన పడుతుంటారు.ఇలా తరచూ మీ పిల్లలు దగ్గుర్రంపు వంటి సమస్యలతో బాధపడుతూ ఎన్నో మందులను ఉపయోగించిన తగ్గకపోతే ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి మీ పిల్లలను ఈ సమస్య నుంచి కాపాడుకోవచ్చు.

చాలామంది పిల్లలు గొంతు నొప్పి సమస్యతో బాధపడుతూ లేదా గొంతు కాస్త బొంగురు పోయినట్టు అనిపిస్తే వేడి నీటిలో ఉప్పు పసుపు లేదా త్రిఫల చూర్ణం వేసి తరచూ నీటిని పుక్కలిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.ఇక పుట్టిన నెల నుంచి 6 నెలల వయసు ఉన్నటువంటి పిల్లలలో ఇలాంటి సమస్య కనుక ఉంటే వారికి ఇలాంటి సహజ చిట్కాలు ఉపయోగించడం కుదరదు కనుక వారికి తల్లి నుంచి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి కనుక ఈ విషయంలో తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇక దగ్గు జలుబు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అల్లం ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది అల్లం పాలలో బాగా మరిగించి పిల్లలకు తాపించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే పుదీనా ఆకులను కూడా మెత్తని మిశ్రమంలో తయారుచేసి అందులోకి కాస్త తేనె కలిపి పిల్లలకు తినిపించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు.