స్పెర్మ్ కౌంట్ పూర్తిగా తగ్గిపోయిందా… కౌంట్ పెరగాలంటే ఇలా చేయాల్సిందే!

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా చాలామంది ఇంట్లో మంచి పోషకాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకొని తినడానికి ఇష్టపడటం లేదు.చాలామంది బయట ఫుడ్ తినడానికి అలవాటు పడుతున్నారు తద్వారా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అధిక శరీర బరువు కావడం, ఒబిసిటీ సమస్యతో బాధపడటం, వంటి ఆనారోగ్య సమస్యలతో పాటు చాలా మంది అబ్బాయిలలో పూర్తిగా తగ్గిపోతూ ఉంది. ఈ విధంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణం ఏంటి? ఈ సమస్యను ఎలా అధిగమించాలి అని విషయానికి వస్తే…

వరికోసెల్.. వృషణాల్లోని సిరల వాపునే వరికోసెల్ అంటారు. ఇది స్పెర్మ్ నాణ్యత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. స్పెర్మ్ ఆరోగ్యం లేదా ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. స్పెర్మ్ తగ్గడానికి దారితీస్తుంది. వీటిలో హెచ్ఐవి వంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, అలాగే వృషణాల వాపు లేదా ఎపిడిడైమిస్ ఉన్నాయి.వీటితోపాటు ఎవరైతే ధూమపానం మద్యపానం మాదకద్రవ్యాలను అధికంగా తీసుకుంటున్నారు అలాంటి వారిలో కూడా స్పెర్ము కౌంట్ పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది.

ఇలా స్పెర్మ్ అకౌంట్ తగ్గిపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. చాలామంది సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతుంటారు.ఇక స్పెర్మ్ అకౌంట్ ఉత్పత్తి అధికంగా నాణ్యతగా ఉండాలి అంటే వీలైనంతవరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. అలాగే ధూమపానం మధ్యపానం వంటి ఆహారపు అలవాట్లను కూడా పూర్తిగా మానుకోవాలి.బరువును అదుపులో ఉంచడం వల్ల స్పెర్మ్ కౌంట్, సంతానోత్పత్తి పెరుగుతుంది. పురుషులకు, మహిళలకు విటమిన్ డి చాలా అవసరం. ఎందుకంటే ఇది సంతానోత్పత్తి సమస్యలను తగ్గిస్తుంది. ఈ విటమిన్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.