మహిళల్లో తలెత్తే అనారోగ్య సమస్యలన్నిటికీ ఇవి తినడం ఒక్కటే చక్కటి పరిష్కారం!!

సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ మనకు అందుబాటులో చక్కగా దొరికే వనరులను పక్కన పడేస్తుంటారు. న్యూట్రిషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు రెండు ఖర్జూర పండ్లను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్, కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభించి మనలో పోషకాహార లోపం తొలగిపోవడమే కాకుండా శరీరాన్ని శక్తివంతం చేయడంలో ఎంతగానో తోడ్పడతాయి. ప్రతిరోజు ఖర్జూర పండును ఆహారంగా తీసుకుంటే పొందే ఆరోగ్య లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చలికాలం లాంటి సీజన్లో మాత్రమే ఖర్జూర పండును తినాలని చెబుతుంటారు. అలాకాకుండా ఏడాది పొడవునా ప్రతిరోజు రెండు ఖర్జూర పండ్లను ఆహారంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించే వ్యాధి నిరోధక శక్తి మనలో పెంపొందుతుంది. ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధించే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి, వెన్నునొప్పి మెడనొప్పి వంటి సమస్యల నుంచి రక్షణ పొందాలంటే ప్రతిరోజు రెండు ఖర్జూర పండ్లను ఆహారంగా తీసుకుంటే ఎముక ,కండరాల బలోపేతానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి.

మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత సమస్యకు సులువుగా చెక్ పెట్టాలంటే రోజుకు రెండు ఖర్జూర పండ్లు తింటే చాలు. ఖర్జూర పండులో సమృద్ధిగా ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12, హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సహాయపడి ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగించడంలో ఖర్జూర పండులోని సహజ పీచు పదార్థం సహాయపడుతుంది తద్వారా పేగు కదలికలు మెరుగుపడి మలబద్ధక, అజీర్తి సమస్యను తొలగించుకోవచ్చు. ఖర్జూర పండ్లలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ ఈ, యాంటీ ఏజింగ్ గుణాలు చర్మ అలర్జీలను, ఇన్ఫెక్షన్లను తగ్గించి వృద్ధాప్య ఛాయాలను తరిమికొడుతుంది.