మనలో తలెత్తే అన్ని అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారాలు ఈ ఆకుల్లో లభిస్తాయనీ తెలుసా?

సాధారణంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ప్రతి దినం బాధపడుతూనే ఉంటారు. మనలో తలెత్తే అనారోగ్య సమస్యలన్నిటికీ మన రోజువారి కార్యకలాపాలు, ఆహారపు అలవాట్లు అని కచ్చితంగా చెప్పొచ్చు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో నిత్య జీవక్రియలకు అవసరమైన విటమిన్స్ మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు సమృద్ధిగా లభించినప్పుడే మనలో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఈ సమస్యలన్నిటిని అధిగమించి మనలో పోషకాహార లోపాన్ని సరి చేసుకోవడానికి ప్రతి రోజు ఎన్నో ఔషధ గుణాలు, పోషక విలువలు సమృద్ధిగా కలిగిన మునగ ఆకులను ఆహారంగా తీసుకుంటే సరిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మనందరం మునక్కాయలను తినటానికి ఇష్టపడతాము. ఇది మంచి విషయమే ఎందుకంటే మునక్కాయల్లో కూడా మన ఆరోగ్యాన్ని రక్షించే అన్ని ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతకంటే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగ ఆకులను తినటానికి సంకోచిస్తున్నాము. మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండి శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే 100 గ్రాముల
మున‌గాకులో 200 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి,440 మిల్లీ గ్రాముల క్యాల్షియం,13.4 గ్రాముల పిండి ప‌దార్థాలు, 1.7గ్రాముల కొవ్వు ప‌దార్థాలు, 6.7 గ్రాముల మాంస‌కృత్తులు, 7 మిల్లీ గ్రాముల ఐర‌న్, 0.9 మిల్లీ గ్రాముల పీచు ప‌దార్థాలు, 2.3 శాతం ఖ‌నిజ ల‌వ‌ణాలు, 97 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది.

తరచూ మన ఆహారంలో మునగ ఆకులను లేదా మునగ ఆకు పొడిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మునగలో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించి రక్తంలో గ్లూకోజ్ నిలువలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఐరన్ లోపాన్ని సవరించి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు పాలల్లో మునగాకు పొడిని కలుపుకొని సేవిస్తూ కీళ్లనొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. సంతానలేమి సమస్యతో బాధపడేవారు మునగాకును తరచూ తింటే లైంగిక వాంఛ పెరుగుతుంది. స్పెర్ము కౌంట్ పెరుగుతుంది, పురుషుల్లో వ‌చ్చే న‌పుంస‌క‌త్వం స‌మ‌స్య తొలగిపోతుంది.