ఈ ఒక్క ఆకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

ఈ మధ్యకాలంలో చాలామంది నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పితో బాధపడడం చూస్తూనే ఉన్నాం. మన ఇంట్లో పెద్దవారికి ఇలాంటి బాధలు వచ్చి కనీస అవసరాలు కూడా తీర్చుకోవడం సాధ్యపడడం ఉండదు. మరి ఇలాంటి నొప్పులకు శాశ్వత పరిష్కారం ఏంటో చూద్దాం.

వంటలలో వినియోగించే బిరియాని ఆకులో మంచి పోషకాలు ఉన్నాయి. ఈ ఆకును అందరూ చూసి ఉంటారు. ఎందుకంటే బిరియాని గురించి తెలియని వారు ఉండరు. కాబట్టి బిర్యానీ రుచిగా ఉండాలంటే అది ఈ ఆకుతోనే సాధ్యం. బిర్యానీ ఆకులను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నాలుగు లేదా ఐదు ఆకులు వేసి, ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీళ్లలో బాగా మరిగించాలి.

అలా మరిగించిన నీటిని 5 నిమిషాల తర్వాత అంటే గోరువెచ్చని స్థితిలోకి వచ్చిన తర్వాత వడగట్టి టీ లేదా కాఫీ తాగినట్టుగా తాగినట్లయితే పొట్ట చుట్టూ ఇంకా కండరాల వద్ద ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. దీని ద్వారా బరువు పెరిగే సమస్య ఉండదు. ఇంకా ఈ వడగట్టిన నీటిని తలపై అప్లై చేయడం ద్వారా చుండ్రు, జుడ్డు సమస్యలు తొలగిపోతాయి. ఇక రెండవ విషయంగా ఈ ఆకులను మిక్సీ ద్వారా పొడి చేసుకుని ఆ పొడిని మజ్జిగ లేదంటే పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.

ఒక కప్పు పెరుగులో అర స్పూన్ పొడిని కలిపి తీసుకోవాలి. మజ్జిగ అయితే ఒక గ్లాస్ మజ్జిగకు అర స్పూన్ పొడిని కలిపి తీసుకోవాలి. ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం చూడవచ్చు. ఈ ఆకు ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడి అల్జీమర్స్ రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ ఆకులను మనం వండుకునే కూరలలో కూడా వినియోగించడం మంచిది. ఈ ఆకులను పొడిచేసి భద్రపరుచుకోవచ్చు.

దీని ద్వారా కిడ్నీలో రాళ్లు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఈ పొడిని కొబ్బరి నూనె లేదంటే ఆముదములో వేసి ఆ నూనెను నొప్పి ఉన్నచోట మర్దన చేసుకున్నట్లయితే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి. చూశారుగా ఈ ఆకుతో ఎన్నో ప్రయోజనాలు. దీనితో ఆరోగ్యంగా ఉండవచ్చు.