రోజుకు ఎన్ని ద్రాక్ష పండ్లను తింటే మన ఆరోగ్యానికి మంచిదో తెలుసా.?

ద్రాక్ష పండ్లు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే. ద్రాక్షలో మన శరీర అవసరాలకు ఉపయోగపడే అన్ని పోషక పదార్థాలతోపాటు ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం అతి బరువు సమస్యతో బాధపడేవారు, జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు ద్రాక్ష పండ్లను తినే విషయంలో కొంత ఆలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ద్రాక్ష పండ్లను పైన చెప్పిన అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉబకాయం అతి బరువు సమస్యతో బాధపడేవారు ద్రాక్ష పండ్లు ఎక్కువగా తింటే శరీర బరువు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కారణాలను పరిశీలిస్తే ద్రాక్ష పండ్లలో అత్యధిక కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు లభ్యమవుతాయి కావున వీటిని అధికంగా తింటే శరీర బరువు మరింత పెరుగుతుంది. కావున ఇలాంటి సమస్య ఉన్నవారు రోజుకు 20 ద్రాక్ష పండ్లను మించి తినకూడదు.

ద్రాక్షలో అత్యధికంగా విటమిన్ సి, ఫైబర్ లభిస్తుంది కావున జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అయితే జీర్ణ సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటేvద్రాక్షపండులో సాలిసిలిక్ యాసిడ్ జీర్ణ సమస్యను మరింత పెంచుతుంది తద్వారా మలబద్ధకం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, విరేచనాలు , అతిసారం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కావున జీర్ణశక్తి తక్కువగా ఉండేవారు రోజులో తక్కువ ద్రాక్ష పండ్లను తినడమే మంచిది.

డయాబెటిస్ ,కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఒకేరోజులో ఎక్కువ ద్రాక్షను తింటే ద్రాక్షలో ఉండే అధిక చక్కర ఆల్కహాల్ రక్తంలో గ్లూకోస్థాయిలను మరింత పెంచుతుంది. మరియు కిడ్నీ సమస్యలతో బాధపడే వారిలో తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.కొందరిలో ద్రాక్షను అధికంగా తినడం లిపిడ్ ట్రాన్స్‌ఫర్ ప్రొటీన్, ద్రాక్షలోని నిర్దిష్ట ప్రోటీన్ కొందరిలో కొన్ని అలర్జీ సమస్యలకు కారణం అవుతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఒకరోజులో సుమారు 34 ద్రాక్ష పండ్లు ను ఆహారంగా తినొచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు 10 నుంచి 15 ద్రాక్ష పండ్లను మించి తినకూడదని చెబుతున్నారు.