మొలకెత్తిన గింజలు తింటే మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు, యాంటీ బయోటిన్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. కావున ప్రతిరోజు అల్పాహారానికి ముందే మొలకెత్తిన గింజలను తినాలని చాలామంది చెబుతుంటారు. దీనికోసం నవధాన్యాలను సేకరించి మంచినీటిలో ఉదయాన్నే నానబెట్టుకుని సాయంత్రం కాటన్ వస్త్రంలో గట్టిగా కట్టి రాత్రంతా ఉంచితే ఉదయానికి గింజలన్నీ మొలకెత్తుతాయి. ఈ మొలకెత్తిన గింజలను ప్రతిరోజు అల్పాహారానికి కంటే ముందే తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకెత్తిన గింజల్లో పుష్కలంగా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలోని వ్యాధి కారకాలను తొలగించి తనలో ఇమ్యూనిటీ శక్తిని పెంపొందిస్తాయి. విటమిన్ ఏ, ఈ కంటి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. మొలకెత్తిన గింజల్లో ఉండే విటమిన్ బి12, ఆల్కైజెస్ ప్రాణాంతక క్యాన్సర్ కణాలను అదుపు చేయడంలో సహాయపడి భవిష్యత్తులో అనేక క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తుంది మొలకెత్తిన గింజల్లో పుష్కలంగా లభించే ఫైబర్ జీర్ణక్రియ రేటును పెంచి జీర్ణ సంబంధిత సమస్యలైన మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తుంది.
మామూలు గింజలతో పోలిస్తే మొలకెత్తిన గింజలు 20రెట్లు అధిక అధిక పోషకాలు లభ్యమవుతాయి. ముఖ్యంగా ఐరన్,పొటాషియం సమృద్ధిగా లభించి హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు శరీర అవయవాలకు సరిపడా రక్త నిల్వలను ఆక్సిజన్ ను అందించడంలో సహాయపడి అవయవాల పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాల్షియం సమృద్ధిగా లభించి వృద్ధాప్యంలో వచ్చే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది. నాడీ కణ వ్యవస్థను దృఢపరిచి మెదడు చురుకుదనాన్ని జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.