కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు రోజు వీటిని నానబెట్టుకుని తింటే అద్భుత ఫలితాలను పొందవచ్చు తెలుసా?

Walnuts-1

మనలో పోషకాహార లోపాన్ని తొలగించుకోవడానికి ప్రతిరోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన వాల్ నట్స్ ను ప్రతిరోజు నానబెట్టుకొని తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.వాల్ నట్స్ లో మన నిత్య జీవ క్రియలకు అవసరమైన అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పుష్కలంగా లభించడంతో పాటు సమృద్ధిగా ఒమేగా ఆమ్లాలు, పాలీఫెనొలిక్ సమ్మేళనాలు, వై-టోకోఫెరోల్, యాంటీ క్యాన్సర్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.

వాల్ నట్స్ ను అలాగే డ్రై గా తినడం కంటే నానబెట్టుకొని తింటే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. వాల్ నట్స్ ప్రతిరోజు నానబెట్టుకుని తినడం వల్ల ఇందులో ఉండే పాలీఫెనొలిక్ సమ్మేళనాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు,విటమిన్ బి12,
సహజ యాంటీ ఆక్సిడెంట్లు మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించి మెదడు కండరాలు,నాడులను శాంతపరిచి దృఢంగా ఉంచడమే కాకుండా మెదడు చురుకుదనాన్ని ,జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి ఎముక సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు నానబెట్టిన వాల్ నట్స్ ను ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే ఆల్ఫా లేనోలినిక్ ఆమ్లాలు ఎముకల దృఢత్వాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.
మరియు అతి బరువు సమస్యతో బాధపడే వారు నానబెట్టుకున్న వాల్ నట్స్ ఎక్కువగా తింటే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండి శరీర బరువును సహజ పద్ధతులు తగ్గించుకోవచ్చు.

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు కొన్ని వాల్ నట్స్ ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది
వాల్‌నట్స్‌లో ట్రిప్టోఫాన్ కూడా పుష్కలంగా ఉండీ
మెదడులో హ్యపీ హార్మోన్లు విడుదల చేసేలా ప్రేరేపించి మిమ్మల్ని మానసిక ఒత్తిడి, డిప్రెషన్ నిద్రలేమి సమస్యల నుంచి కాపాడుతాయి.వాల్ నట్స్ లో వై-టోకోఫెరోల్,విటమిన్ ఇ లభ్యమవుతాయి కావున చర్మ సమస్యలను,చర్మ క్యాన్సర్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.