అనీమియా, రక్తపోటు సమస్యలకు చెక్ పెట్టాలంటే ప్రతి రోజు ఈ జ్యూస్ సేవించాల్సిందే?

మనందరి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండే బచ్చలి కూర మొక్క ఆకులతో రుచికరమైన పప్పు, ఫ్రై, సలాడ్స్, సూప్స్, బజ్జీలు వంటివి తయారు చేసుకుని తినొచ్చు. దాంతోపాటే ప్రతిరోజు బచ్చలి కూర జ్యూస్ ను సేవిస్తే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే బచ్చలి కూర జ్యూస్ సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

బచ్చలికూర ఆకులో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, సాఫోనిన్ అనే పదార్థం లభిస్తుంది. కావున మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బచ్చలి కూర ఆకుల్లో ఉండే క్లోరోఫిన్, బీటాకెరోటిన్ వంటి ఔషధాలు శరీరంలో పెరిగే క్యాన్సర్ కారకాలను నియంత్రించి కణాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. బచ్చలి కూరలో లభించే పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.మెగ్నీషియం, మాంగనీస్, సోడియం వంటి ఖనిజ లవణాలు నాడీ వ్యవస్థను దృఢపరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బచ్చలి కూర రసాన్ని సేవిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా మూత్రపిండంలో రాళ్ల సమస్యలు కూడా అరికడుతుంది.బచ్చలి కూరలో అత్యధికంగా 24.8 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది కావున ఎముకలు, దంతాలు దృఢంగా ఉంచడంతోపాటు భవిష్యత్తులో వచ్చే దంత క్షయం, కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.అనీమియా సమస్యతో బాధపడేవారు బచ్చలి కూరను ఆహారంగా తీసుకున్న లేదా బచ్చలి కూర జ్యూస్ ను ప్రతిరోజు సేవిస్తే ఇందులో మిల్లి గ్రాములు పుష్కలంగా ఉన్న ఐరన్ రక్త కణాల వృద్ధికి తోడ్పడి మనలో ప్రమాదకర అనీమియా సమస్యను తొలగించడంతోపాటు నీరసం, ఒత్తిడి, చేతులు కాళ్ళ తిమ్మిర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది.