గోర్లను కొరికే వారికి దురదృష్టం వెంటాడుతుంది అని మన పెద్దవారు చెబుతున్నారు. అలా చెప్పడానికి కారణాలు లేకపోలేదు మనం ఏ పని చేసిన మొదట తాగేది చేతి గోర్లే కాబట్టి గొర్ల సందుల్లో ప్రమాదకర సూక్ష్మజీవులు ఉండిపోతాయి. మనం చేతుల్ని శుభ్రంగా కడుక్కోకుండా చేతి గోర్లను కొరికితే మనలో వ్యాధిని కలగజేసే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్లు సులువుగా మన నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనేక అనారోగ్య సమస్యలను కలగజేస్తాయి. అందుకే మన పెద్దవారు గోర్లను కొరికితే దురదృష్టం వెంటాడుతుంది అని చెబుతుంటారు.
ఏదో పరధ్యానంలో గోర్లను కొరికే అలవాటు ఉన్నవారు తక్షణం ఈ అలవాటును మానుకోవాలి లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదంటున్నారు వైద్యులు. గొర్లల్లో మన శరీరంలోకి సులువుగా ప్రవేశించే ప్రమాదకర సాల్మోనల్లటైపే ఈకొలిఅనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కావున గోర్లు కొరికే చెడు అలవాటును మానుకొని ఎప్పటికప్పుడు గోర్లు పెరిగిన వెంటనే కత్తిరించుకొని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు మట్టిలో ఆడుకుంటూ చేతులు శుభ్రం చేసుకోకుండా అలాగే ఏదో ఒక ఆహార పదార్థాన్ని తింటుంటారు. మట్టిలో ఆడుకున్నప్పుడు గొర్ల సందుల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ,వైరస్లు ఉండిపోయి పిల్లల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తాయి కావున పిల్లలకు క్రమం తప్పకుండా గోర్లు పెరిగిన వెంటనే నెయిల్ కట్టర్ తో కత్తిరించి శుభ్రంగా ఉండునట్లు చూసుకోవాలి.
తరచూ గోర్లు కొరికే అలవాటు ఉన్నవారిలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా నోటి క్యాన్సర్, ఊదర క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.గొర్ల సందులో ఉన్నటువంటి ప్రమాదకర బ్యాక్టీరియా కడుపులోకి సులువుగా ప్రవేశించి ఒక్కొక్కసారి వాంతులు, విరోచనాలు, డయేరియా వంటి సమస్యలు తలెత్తవచ్చు. గోర్లను కొరికే అలవాటు ఉన్నవారిలో చిగుళ్ల సమస్యలు, పంటి సమస్యలు, దవడ ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన కండరాలు నరాలపై తీవ్ర ప్రభావం చూపే బ్యాక్టీరియా గోర్లను కొరికే అలవాటు వల్ల శరీరంలో ప్రవేశించి డెర్మటా ఫాగియా అనే తీవ్ర సమస్య తలెత్తవచ్చు. ఏది ఏమైనా గోర్లు కొరకడం చెడ్డ అలవాటు కాబట్టి తొందరగా ఈ అలవాటును మానుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అని చెప్పొచ్చు.