Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?అందుకు కారణం ఐరన్ లోపం కావచ్చు..!

Health Tips: ఈరోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో పడి ప్రజలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు రావటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ తన శరీరంలో మార్పులు కనిపించినా కూడా పట్టించుకోవటం లేదు. తద్వారా రోగాలు ముగ్గురి ప్రాణాల మీదికి వస్తోంది. ఈ మధ్యకాలంలో పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.

ఐరన్ మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు రక్తంలోని హిమోగ్లోబిన్ తయారు అవ్వదు. అంతేకాకుండా ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ నీ అన్ని అవయవాలకు సరఫరా చేయలేదు. తద్వారా శరీరంలో రక్తహీనత సమస్య తలెత్తుతుంది. రక్తహీనత సమస్య వల్ల అలసట, నీరసం, కాళ్లు చేతులు చల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపం గుర్తించటానికి కనిపించే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

*ఐరన్ లోపంతో బాధపడేవారిలో రక్త కణాల సంఖ్య తగ్గి చర్మం పసుపు రంగులో కనిపిస్తుంది. ఆహారం తీసుకున్నా కూడా అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది.

*అరుణ్ సొంత బాధపడేవారిలో అకస్మాత్తుగా పాదాలు హరి చేతులు చల్లబడతాయి. అంతేకాకుండా చాతిలో నొప్పి, హృదయ స్పందన ఎక్కువగా లేదా తక్కువగా ఉంటుంది.

* జుట్టు రాలిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గోర్లలో పగుళ్లు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం.

శరీరంలో ఐరన్ శాతం పెంచుకోవటానికి ఆహార పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం.పచ్చి కూరగాయలు, బఠానీలు,బ్రోకలీ, బచ్చలి కూర, నువ్వులు, బెల్లం బీన్స్ వంటివి ఆహారంతో ఉండేలా చూసుకోవాలి.