కళ్ళల్లో ఈ లక్షణాలు కనపడుతున్నాయా….. ఈ సమస్యతో బాధపడుతున్నట్టే!

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అధిక బరువు సమస్య అందరిని వేధిస్తోంది. మనం తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.మన శరీరంలో పేరుకుపోయిన ఈ కొలెస్ట్రాల్ కారణంగా మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము.

ఇక శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ బయటకి కనిపించకపోయినా కూడా మన కళ్ళ ద్వారా ఈ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను గుర్తించవచ్చు. కొన్ని సందర్భాలలో మన కళ్ళల్లో కనిపించే కొన్ని లక్షణాల వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉందని గుర్తించవచ్చు. మరి కలలో ఎలాంటి లక్షణాలు కనబడటం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకు పోయింది అని గుర్తించవచ్చు అనే విషయానికి వస్తే…

అధిక బరువు, హై బీపీ, డయాబెటిస్ ఉన్న వారిలో కళ్లు లేదా ముక్కు చుట్టూ చదునుగా లేదా ఉబ్బెత్తుగా ఉన్నట్టు పసుపు రంగులోకి మారడం మనం గమనించవచ్చు. అధిక కొవ్వు వలన కనిపించే లక్షణాలలో ఇది కూడా ఒకటి. కొందరి కళ్ళల్లో కళ్లలోని కార్నియా చుట్టూ తెల్లని రింగ్ లా ఏర్పడుతుంది. దీనిని కార్నియల్ ఆర్కస్ అని పిలుస్తారు. సాధారణంగా లక్షణం వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. యువకులలో కూడా ఈ లక్షణం కనిపిస్తే అందుకు కారణం అధిక కొలెస్ట్రాల్ అని మనం గమనించవచ్చు.
కళ్ళు వాపు రావటం కళ్ళల్లో నొప్పి కలగటం కంటి చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలకు ముఖ్య కారణం కూడా అధిక కొలెస్ట్రాల్. కన్ను వెనుక భాగంలో ఉండే రెటీనా పొర కి సిరలు ధమనుల ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది.