ఉదయాన్నే ఒక గ్లాస్ కషాయంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు…. ఎలాగంటే?

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కాకరకాయను కొంతమంది ఎంతో ఇష్టంగా తింటారు. మరికొందరైతే కాకరకాయ పేరు ఎత్తగానే చిరాకు పడుతుంటారు. కారణం కాకరకాయలు చేదు గుణం ఉండడమే. కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. కాకరకాయని తినడానికి ఇష్టపడని వారు ఇందులోని ఆరోగ్య రహస్యాలు గురించి తెలిస్తే ఖచ్చితంగా తినడానికి ప్రయత్నం చేస్తారు.

కాకరకాయలో విటమిన్ ఏ,విటమిన్ బి1, విటమిన్ బి2, విటమన్ బి3,పొటాషియం, ఫైబర్, క్యాల్షియం, జింక్, థైయమిన్,బీట కేరొటిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కావునా కాకరకాయను ప్రతిరోజు కూర రూపంలోనే కాకుండా జ్యూస్ రూపంలో తీసుకుంటే సకల వ్యాధి సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్రతిరోజు కాకరకాయ కషాయాన్ని అల్పాహారానికి ముందే సేవిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్,యాంటీ మైక్రోబియల్ గుణాలు బాహ్య శరీరంలో ఫ్రీ రాడికల్స్ నియంత్రించి వ్యాధికారక క్యాన్సర్లను, సూక్ష్మ జీవులను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మరియు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు తరచూ కాకర కషాయాన్ని సేవిస్తే కాకరకాయలో ఉండే హైపోగ్లసమిక్ పదార్ధము శరీరంలోని ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి ప్రమాదకర డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. కాకరకాయ లో ఉన్న ఔషధ గుణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడంలో సహాయపడి అతి బరువు సమస్య ,అధిక రక్తపోటు, గుండె జబ్బుల తీవ్రతను తగ్గిస్తుంది. మూత్రశయ ఇన్ఫెక్షన్లను తగ్గించి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.