మీకు వ్యాయామం చేసే అలవాటు ఉందా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి?

ఈ రోజుల్లో చాలామంది పట్టణ జీవనానికి అలవాటు పడి శారీరక శ్రమ తక్కువగా ఉండడంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఉదయం, సాయంత్రం కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం లాంటివి చేస్తుంటాం అయితే వ్యాయామం ఎలా పడితే అలా చేస్తే కండరాలు పట్టేయడం, వెన్నునొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం చేసేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాయామం, నడక వంటివి ప్రతిరోజు అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మొదట గుర్తించుకోవాల్సిన విషయం వ్యాయామం చేయడానికి రెండు గంటల ముందు కడుపునిండా ఆహారాన్ని తీసుకోవద్దు ఇలా చేస్తే పొట్ట పట్టేయడం, కండరాల నొప్పులు, వికారం, వాంతులు సమస్య తలెత్తి వ్యాయామం చేయడానికి అసౌకర్యంగా ఉంటుంది. వ్యాయామం చేయడానికి ముందు సన్నద్ధ వ్యాయామాలు చేస్తే కండరాల్లో రక్త ప్రసరణ పెరిగి కండరాలు సులువుగా వదులుగా కదలడానికి వీలవుతుంది.

మన శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని వ్యాయామాలను ఎన్నుకోవాలి. అలాకాకుండా శక్తికి మించి బరువులు ఎత్తిన, శరీరాన్ని ఎక్కువ ఒత్తిడికి గురి చేసిన కండర నరాలు పట్టేసి కండరాల నొప్పులు, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. బరువులు ఎత్తేటప్పుడు ఒకేసారి ఎక్కువ బరువు కాకుండా రోజురోజుకు పెంచుకుంటూ పోవాలి. కొంతమంది కొన్ని రకాల వ్యాయామాలు, బరువులు ఎత్తేటప్పుడు ఊపిరి గట్టిగా బిగపట్టి ఉంచుతారు దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అంది నీరసం వస్తుంది. బరువు ఎత్తే ముందు ఊపిరిని గట్టిగా పీల్చుకొని నెమ్మదిగా బయటికి వదలాలి. ముఖ్యంగా బరువులు ఎత్తేటప్పుడు వెన్నెముకను భుజాల వెనక్కి విశ్రాంతిగా ఉండునట్లు ఉంచాలి. మోకాళ్ళను సరైన భంగిమలు ఉంచి మరీ గట్టిగా బిగబట్టి ఉంచరాదు.