శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? అయితే ఈ యోగాసనాలను ట్రై చేయండి!

ఈ రోజుల్లో చాలామంది వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా ,శ్వాసకోశ వాపు, దగ్గు, జలుబు వంటి అనేక శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ప్రతి దినం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు.మీరు కూడా ఇలాంటి లక్షణాలతో బాధపడుతుంటే సున్నితమైన ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సహజంగా ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి మీరు క్రమం తప్పకుండా యోగా,వ్యాయామ వంటి వాటిని అలవర్చుకుంటే సహజ పద్ధతిలో శ్వాస సంబంధిత సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి శ్వాస సమస్యల నుంచి రక్షణ పొందాలంటే ప్రతిరోజు ప్రాణాయాయం అలవాటు చేసుకుంటే సరిపోతుంది ప్రణాయామం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణాయామం చేయడానికి శ్వాస మీద ధ్యాస ఉంచి పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని చేయాలి.చేతులు చిన్‌ముద్రలో ఉండాలి. కండ్లు మూసుకుని నిదానంగా శ్వాసను పీల్చుతూ,వదులుతూ ఉండాలి.బొటన వేలితో కుడి నాసిక రంధ్రం మూస్తూ ఎడమ నాసిక రంధ్రం నుంచి శ్వాసను తీసుకోవాలి.మూడు అంకెలు లెక్కించే సమయంలో చేయాలి. మళ్లీ అదే సమయంలో వదలాలి. అలానే కుడి నాసిక రంధ్రం మూస్తూ ఎడమ నాసిక రంధ్రం ఉంచి శ్వాసను వదలాలి.ఇలా 5 నుంచి 10 సార్లు చేస్తే సరిపోతుంది. ముఖ్య విషయం ఏమిటంటే ప్రాణాయాయంలో కొన్ని నియమాలు పాటించాలి.ఉదయం సాయంత్రం మాత్రమే చేయాలి. ఖాళీ కడుపుతో ప్రాణాయామం అస్సలు చేయకండి.

అనులోమ విలోమాసనంలో మన నాసిక ఒక్క రంధ్రం నుంచి గట్టిగా శ్వాసను పీలుస్తూ మరో రంధ్రం నుంచి వదిలేయడాన్ని అనులోమ విలోమ పద్ధతి అంటారు.ఇలా ప్రతిరోజు చేయడంతో శ్వాస నాళాల పనితీరు మెరుగుపడటంతో శ్వాసక్రియ వృద్ధి చెందుతుంది. వీరభద్రాసన శ్వాస సంబంధిత వ్యాధులను తొలగించి ఊపిరితులను ఆరోగ్యంగా ఉంచడంలో చక్కగా సహాయపడుతుంది. ఈ యోగాసనాల ద్వారా శ్వాస సంబంధ సమస్యలు తొలగిపోవడమే కాకుండా శారీరక మానసిక దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.