దాదాపు అన్ని రకాల కూరల్లో కరివేపాకు వాడడం సర్వసాధారణం. అయితే చాలామందికి తెలియని విషయం ఏమంటే కరివేపాకులో మన ఆరోగ్యాన్ని పరిరక్షించే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ గుణాలు పుష్కలంగా లభిస్తాయన్న విషయం తెలియక పడేస్తుంటారు. కరివేపాకును కూరల్లోనే కాకుండా ప్రతిరోజు వీటి కషాయాన్ని తాగితే అదనపు పోషకాలు లభించడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
కరివేపాకు కషాయాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తాజా కరివేపాకులను సేకరించి వాటిని తగినన్ని నీళ్లలో వేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత వచ్చిన కషాయాలో రుచి కోసం తేనెను, నిమ్మకాయ రసాన్ని కలుపుకోవచ్చు. ఈ కరివేపాకు కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ, విటమిన్ సి, మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కరివేపాకు కషాయాన్ని సేవిస్తే ఇందులో పుష్కలంగా ఉన్న ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బి12 మన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. కరివేపాకులో పుష్కలంగా ఉన్న కాల్షియం దంతాలను ఎముకలను దూరంగా ఉంచి ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి వ్యాధులను రాకుండా అరికడుతుంది.
కరివేపాకు ఆకులో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ కంటి సమస్యలను తగ్గించి కంటి చూపులు మెరుగుపరుస్తుంది. తీవ్ర పని ఒత్తిడి సమస్యతో బాధపడేవారు కరేపాకు కషాయాన్ని ప్రతిరోజు చేయిస్తే ఈ ఆకుల్లో ఉన్న అరోమా ఔషధ నాడీ కణాలను ఉత్తేజపరిచి మానసిక ఆనందాన్ని పెంపొందిస్తుంది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు కరివేపాకు రసాన్ని సేవిస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. అతి బరువు సమస్యతో బాధపడేవారు కరివేపాకు రసాన్ని సేవిస్తూ చెడు కొలెస్ట్రాల్ తొలగించి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలను శుద్ధిచేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.