పెసలు ధాన్యంతో ఇలా చేస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం?

నవధాన్యాల్లో ఒకటైన పెసలు ధాన్యంలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థం ,విటమిన్స్ ,మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.
అత్యధిక ప్రోటీన్స్ కలిగిన పప్పు దాన్యంలో పెసలు ధాన్యం కూడా ప్రధానమైనదిగానే చెప్పొచ్చు. పెసలతో పెసర పాయసం ,పెసరట్టు ,పెసరపప్పు, పొంగల్ వంటి అనేక రుచికరమైన వంటకాలను తయారు చేసుకొని తినవచ్చు. ముఖ్యంగా పెసలు ఉడకబెట్టుకుని తిన్న లేదా మొలక కట్టుకొని ప్రతిరోజు మన ఆహారంలో తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ సమృద్ధిగా లభించడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

పెసలు ధాన్యంలో మన శరీర పోషణకు అవసరమైన క్యాల్షియం, ఐరన్ ,పొటాషియం ,మెగ్నీషియం, జింక్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి వీటిని ఆహారంగా తీసుకుంటే కాల్షియం సమృద్ధిగా లభించి ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఐరన్ రక్తంలోని రక్త కణాల అభివృద్ధికి సహాయపడి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు సమస్యను అదుపు చేయడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

ప్రతిరోజు ఉదయాన్నే మొలకెత్తిన పెసలు గింజలను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ప్రోటీన్స్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పూజిస్తాయి. ప్రతిరోజు సాయంత్రం ఉడకబెట్టిన ప్రజలను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది.

పెసలులో డెంటరి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షించి కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అత్యధికంగా ఫైబర్ ఉండడం వల్ల రక్తంలో గ్లూకోస్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. పెసలు ప్రతిరోజు తినటం వల్ల హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపించి తలనొప్పి ,నీరసం ,కండరాల ,నొప్పులు వంటి సమస్యలను తొలగిస్తుంది. పెసలు కంటి ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి.