రోగ నిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటున్నారా అయితే ఇలా చెయ్యండి!

రోగనిరోధక శక్తి శరీరంలో తగ్గినప్పుడు ఏ చిన్న వ్యాధి వచ్చిన భరించడం కష్టం, ఏ చిన్న గాయం అయినా కూడా చాలా రోజుల వరకు కోలుకోలేము. మరి ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి సహజ సిద్ధంగా ఇంట్లో లభించే ఆహార పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయి.

నిమ్మకాయ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజుకు ఒక గ్లాసు నిమ్మరసం తాగినట్లయితే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. రెండు లేదా మూడు బాదాం విత్తనాలను రాత్రి నానబెట్టుకుని ఉదయం దానిపై ఉన్న పొట్టు తీసేసి తింటే జలుబు లాంటి సమస్యలు దూరం అవుతాయి ఇందులో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది.

ఇక మనం రోజు తినే ఆహారంలో ఒక్క పూట ఆయన కచ్చితంగా పెరుగును తినాలి ఇందులో ఒక స్పూన్ తేనె కలుపుకుంటే మంచిది. దీనివల్ల విటమిన్-డి శరీరానికి పుష్కలంగా అందుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మనం ఇళ్లల్లో తయారు చేసుకునే కర్రీలలో రెగ్యులర్ గా వాడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

పాలకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. అల్లం గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది. ఉదయం సాయంత్రం మనం తాగే టీ లో ఈ అల్లం వేసి త్రాగడం మంచిది గొంతు సమస్యలు అనేటివి దూరం అయ్యి ఇది కూడా రోగ నిరోధక శక్తి పెంచడానికి దోహదపడుతుంది.

మనం ఇళ్లల్లో ఉపయోగించే వెల్లుల్లి ఒక మంచి ఔషధం. దీనిని ఎక్కువగా ఆవకాయలలో, పప్పు దినుసులతో పాటు వినియోగిస్తుంటాము దీని ద్వారా కూడా రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. ఎండు ద్రాక్షలో జింక్, ఐరన్, ఫైబర్, విటమిన్ బి12 లు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు రోజు నడవడం, వ్యాయామం చేయడం రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండి ఆరోగ్యం బాగుంటుంది.