తల తిరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే!

మనలో చాలామంది కళ్లు తిరగడం, తల తిరగడం వల్ల ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలని నెగ్లెక్ట్ చేస్తే దాని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, నీరసం ఇలా వివిధ కారణాల వల్ల ఈ సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తలనొప్పి, అలసట, తిన్నాక మరియు వ్యాయామం చేశాక కళ్ళు తిరగడం, బలహీనంగా అనిపించడం, కంటి చూపులో మార్పు తల తిరగడానికి కారణమని చెప్పవచ్చు.

హార్ట్‌బీట్ సరిగ్గా లేకపోవడం అంటే కొన్ని కొన్ని సార్లు హార్ట్ బీట్ కొన్ని సెకన్ల పాటు ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. బ్లడ్ ఫ్లో టెంపరరీగా బ్రెయిన్‌కి వెళ్లపోతే కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి. హఠాత్తుగా బ్లడ్ ప్రెషర్లో మార్పు కనపడడం వలన బ్లడ్ సప్లై బ్రెయిన్‌కి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. . హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్‌తో కొట్టుకున్నప్పుడు కూడా ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఉంటాయి.

గుండె వేగంగా కొట్టుకున్నా, గుండె నెమ్మదిగా కొట్టుకున్నా కూడా కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. సరైన మెడికేషన్, సరైన ట్రీట్మెంట్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. సమస్య చిన్నదైనా ఎక్కువ మందులు వేసుకోవడం చేయకపోతే ఆరోగ్యానికి మంచిది. రెగ్యులర్ గా మీల్స్ తీసుకోవడంతో పాటు ఎనిమిది గ్లాసుల మంచి నీళ్ళు త్రాగడం చాలా అవసరం అని చెప్పవచ్చు.

ఎక్కువగా కళ్లు తిరిగేవాళ్ళు వేడిగా ఉండేచోట ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. డయాబెటిస్ లేదా కార్డియో వాస్క్యులర్ సమస్యలు ఉంటే మంచి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడితే మంచిది. బ్లడ్ ప్రెషర్ లాంటివి రెగ్యులేట్ చేసుకోవడానికి సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం, హైడ్రేట్‌గా ఉండటం లాంటి నియమాలను పాటిస్తే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.