మనలో ఐరన్ లోపం తలెత్తడానికి ఇది కూడా కారణం కావచ్చునీ తెలుసా?

సాధారణంగా అన్ని రకాల పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, గింజలు ఇలా అన్నిట్లోనూ మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే వేటి ప్రత్యేకత వాటిది. ఒక్కొక్క ఆహార పదార్థంలో ఒక్కొక్క పోషక విలువ ఎక్కువగా ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు. సీజనల్ గా లభించే అన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడే మనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అయితే మన ఆరోగ్య పరిస్థితుల దృశ్య కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో పాలక్ పన్నీరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మందికి పాలక్ మరియు పన్నీరు కలిపి వండుకొని తినే అలవాటు ఉంటుంది. ఈ రెండిటిని కలిపి చేసే వంటకం చాలా రుచిగా ఉంటుంది
కొందరికి ఇది ఎంతో ఇష్టమైన ఆహారం కూడా. వాస్తవానికి పాలక్ మరియు పన్నీరు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండిటిలో మన శరీర పోషణకు అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే ఈ రెండు ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల కొందరిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.మరి ఈ రెండిటిని కలిపి తింటే ఎటువంటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పన్నీర్లో అత్యధికంగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. పాలక్ లో అత్యధికంగా ఐరన్, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో లభించే పోషక పదార్థాలన్నీ మన ఆరోగ్యానికి మంచివే ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఐరన్ లోపంతో బాధపడేవారు పాలక్ మరియు పన్నీరును కలిపి తీసుకున్నప్పుడు పన్నీరులో అధికంగా ఉండే కాల్షియం శరీరంలో ఐరన్ మూలకాన్ని గ్రహించడంలో అడ్డంకులను ఏర్పరుస్తుంది. ఫలితంగా మనలో ఐరన్ లోపం తలెత్తి ప్రమాదకర రక్తహీనత సమస్యకు దారి తీయవచ్చు. కాబట్టి ఈ రెండింటిని కలిపి తినే విషయంలో మన ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.