సాధారణంగా ఒక మహిళ గర్భం దాలిస్తే ఆమె శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి.ఇలా మహిళ గర్భం దాల్చిన సమయంలో హార్మోన్ల అసమర్థ్యత కారణంగా ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే కొందరు మధుమేహానికి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇలా గర్భం దాల్చిన మహిళ మధుమేహానికి గురైతే పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదకరంగా మారుతుందని భావిస్తూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు మధుమేహానికి గురికాకుండా ఉండాలంటే రాత్రిపూట ఈ పద్ధతులను పాటిస్తే ఎంతో మంచిది.
గర్భిణీ స్త్రీలు నిద్రపోయే ముందు తమ గదిలో గదిలో లైట్లను . ముఖ్యంగా కంప్యూటర్, మొబైల్ స్కీన్ల వెలుతురును ఆర్పివేయాలని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ వర్సిటీ స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం నిద్రపోయే ముందు వరకూ కాంతివంతమైన లైట్ల కింద గడిపితే శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ గాడి తప్పుతుందని ఈ సర్వేలో వెళ్లడైంది.
నిద్రకు ముందుకు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తి కడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుంది. 741 మంది గర్భిణులపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందుకే గర్భం దాల్చిన మహిళలు వీలైనంత వరకు టీవీలు సెల్ ఫోన్లు కంప్యూటర్ల ముందు ఎక్కువగా ఉండకపోవడమే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా రాత్రి సమయంలో ఈ చిన్న పని చేయటం వల్ల గర్భిణీ స్త్రీలు మధుమేహం వ్యాధి నుంచి బయటపడవచ్చు.