పచ్చకామెర్ల తో బాధపడేవారు ఈ పానీయాన్ని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనం పొందుతారు తెలుసా?

ఒకప్పుడు చెరుకు రసాన్ని సేవించడానికి చాలామంది ఇష్టపడేవారు కాదు కారణం చేరుకు రసాన్ని సేవిస్తే జలుబు చేస్తుందని, బరువు పెరుగుతారని, షుగర్ వ్యాధి వస్తుందని రకరకాల కారణాలు చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో చాలామంది చెరుకు రసం లోని ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి చెరుకు పానీయాన్ని సేవించడానికి ఇష్టపడుతున్నారు.దానికి అనుగుణంగానే ప్రతి పల్లెలో మరియు పట్టణాల్లో చెరుకు రసాన్ని తీసి అమ్మే షాపులు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. చెరుకు రసంలో అల్లం, నిమ్మరసం, పుదీనా కలుపుకొని సేవిస్తే అద్భుతమైన రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ముఖ్యంగా శీతాకాలంలో ప్రతిరోజు చెరుకు రసాన్ని సేవిస్తే ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్గా వచ్చే జలుబు వంటి ఫ్లూ లక్షణాలను నియంత్రిస్తుంది. అలాగే జీవక్రియలకు అవసరమైన నీటి శాతాన్ని అందించి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో లభించే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఐరన్ సమృద్ధిగా లభించి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు అలసట నీరసం, చికాకు వంటి లక్షణాలను మీలో తగ్గిస్తుంది. చెరుకు రసంలో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఖనిజలవణాలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి.

చెరుకు రసంలో సమృద్ధిగా లభించే ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ బి12, విటమిన్ b6, యాంటీ ఆక్సిడెంట్ మహిళల్లో ముఖ్యంగా గర్భిణీ మహిళల్లో తలెత్తే రక్తహీనత సమస్యను తగ్గించి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ప్లావనాయిడ్స్ మహిళలను ఎక్కువగా వేధించి రొమ్ము క్యాన్సర్ ను సమర్థవంతంగా నిరోధిస్తుంది. చెరుకు రసంలో ఉండే విటమిన్ సి విటమిన్ ఏ యాంటీ ఏజింగ్ గుణాలు చర్మాన్ని వృద్ధాప్య లక్షణాల నుంచి కాపాడతాయి.పచ్చకామర్ల సమస్యతో బాధపడేవారు చెరుకు రసాన్ని సేవిస్తే బెల్లి రూబిన్ లెవెల్స్ ను నియంత్రించి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా పచ్చకామర్ల వ్యాధి అదుపులోకి వస్తుంది. చెరుకు