ఈ ఏడాది సమ్మర్ సీజన్ ముందుగానే మనల్ని పలకరిస్తోంది.సీజన్ ఆరంభంలోనే తీవ్రమైన ఉష్ణోగ్రతలు అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో ప్రతి ఒక్కరూ డిహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిత్యం శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి రసాయనాలు ఉన్న కూల్ డ్రింక్స్ కు బదులు చెరుకు రసాన్ని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను సహజ పద్ధతిలో పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా వాతావరణం అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు మన శరీరం నీటి శాతాన్ని అధికంగా కోల్పోతుంది ఫలితంగా డీహైడ్రేషన్ సమస్య తలెత్తి అవయవాల పనితీరు మందగించి అలసట, నీరసం, చికాకు, కళ్ళు తిరగడం, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు విరోచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలన్నింటినీ ఈ సమ్మర్ సీజన్ లో అధిగమించాలంటే ప్రతి రోజు ఒక గ్లాసుడు చెరుకు రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే అధిక కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ,విటమిన్స్ ,మినరల్స్ మన శరీరానికి తక్షణ శక్తి అందించి రోజంతా మిమ్మల్ని హుషారుగా ఉంచడంలో సహాయపడతాయి.
ప్రతిరోజు చెరుకు రసాన్ని సేవిస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది కావున శరీర బరువును నియంత్రించడంలో చెరుకు రసం దివ్య ఔషధంలా పనిచేస్తుంది.గర్భిణి స్త్రీలు, పాలిచ్చే తల్లులు చెరుకు రసాన్ని తరచూ సేవిస్తే రక్తహీనత సమస్య తొలగిపోతుంది. చెరుకు రసంలో సమృద్ధిగా ఉన్న కాల్షియం ఎముకల, దంతాల దృఢత్వానికి తోడ్పడుతుంది. చెరుకు రసంలో గ్లైకోలిక్, ఆల్ఫా-హైడ్రాక్సీ వంటి ఆమ్లాలు అధికంగా ఉండి కణాల ఉత్పత్తిని పెంచి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంతో పాటు మొటిమలను, ముడతలను, వృద్ధాప్య లక్షణాలను తొలగించడంలో సహాయపడుతుంది.