రక్తహీనత,డయాబెటిస్ వ్యాధుల తీవ్రత తగ్గించుకోవాలంటే ఈ పండ్లతోనే సాధ్యమవుతుందని తెలుసా?

ఎన్నో ఉత్తమమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అతి మధురమైన పండు రామాఫలం ఈ పండును వైల్డ్ స్వీట్ అని కూడా అంటారు. సీతాఫలం వర్గానికి చెందిన ఈ పండులో అత్యధిక ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థం, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, పైరిడాక్సిన్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ అధిక మొత్తంలో లభిస్తాయి. ఎర్రని రంగుతో పై తోలు మందంగా ఉండే రామా ఫలం పండ్లు ఎక్కువగా అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా లభిస్తాయి. సీజనల్ గా లభించే రామా ఫలం పండ్లను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రామా ఫలం లోపలి గుజ్జు అతి మధురంగా అచ్చం సీతాఫలం పండును పోలి ఉంటుంది. ఇందులో అత్యధికంగా లభించే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు అన్ని రకాల కంటి సమస్యలను, చర్మ సమస్యలను, జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ పండు ప్రత్యేకత ఏమిటంటే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధులను నియంత్రించే అద్భుత ఔషధ గుణాలు ఇందులో మెండుగా లభిస్తాయి. అతి బరువు సమస్యతో బాధపడేవారు ఈ పండును ప్రతిరోజు డైట్లో తీసుకుంటే ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వేగంగా తరిగిపోయి ఉబకాయం సమస్య నుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పండ్లను తినే విషయంలో తెగ ఆలోచిస్తుంటారు అయితే రామా ఫలం పండును నిక్షేపంగా తినొచ్చు ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలో చక్కెర నిల్వలను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతాయి అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థ లోపాలను సవరించి రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలసట, నీరసం వంటి లక్షణాలు మీలో కనిపిస్తుంటే అది రక్తహీనత సమస్య కారణ కావచ్చు ఇలాంటివారు ప్రతిరోజు రెండు రామా ఫలం పండును ఆహారంగా తీసుకుంటే ఇందులో లభించే శక్తివంతమైన కేలరీలు, ఐరన్, విటమిన్ బి12 తక్షణ శక్తిని అందించడమే కాకుండా ప్రమాదకర అనీమియా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.