బిర్యానీ ఆకులను సహజంగా నాన్ వెజ్ వంటకాలైన చికెన్, మటన్, ఎగ్ బిర్యానీల్లో రుచి ,సువాసనల కోసం ఉపయోగిస్తాము అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉన్న బిర్యాని ఆకులతో రుచికరమైన టి నీ తయారు చేసుకోవచ్చన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు బిర్యానీ ఆకుల టీ ఎలా తయారు చేసుకోవాలి, దీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన బిర్యాని ఆకుల టి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదట రెండు లేదా మూడు పచ్చి బిర్యానీ ఆకులు లేదా ఎండు బిర్యానీ ఆకులను సేకరించి చిన్న ముక్కలుగా కట్ చేసి తగినన్ని నీరు పోసి బాగా మరగనిచ్చిన తర్వాత వడగట్టుకుని వచ్చిన కషాయాన్ని ప్రతిరోజు సేవించినట్లయితే మన శరీరంలో చెడు మలినాలు తొలగి వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.
బిర్యానీ ఆకుల టీ ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి ఉబకాయం, అతిగా బరువు పెరగడం వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
బిర్యానీ ఆకులు రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి కావున ప్రతిరోజు వీటి కషాయం తాగితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చక్కెర వ్యాధి అదుపులో ఉండి మంచి ఫలితం ఉంటుంది.
యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ వైరల్ గుణాలు బిర్యానీ ఆకుల్లో మెండుగా ఉంటాయి .కాబట్టి వీటి కషాయాన్ని ప్రతిరోజు తాగితే సీజనల్గా వచ్చే జలుబు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత వ్యాధులను సమర్థవంతంగా ఎదిరించవచ్చు.
బిర్యానీ ఆకుల్లో ఫైటో న్యూట్రియెంట్స్ ఉండడంవల్ల వీటిని ప్రతిరోజు కషాయంగా తీసుకుంటే మన శరీరంలోని క్యాన్సర్ కారకాలతో సమర్థవంతంగా పోరాడతాయి.
బిర్యానీ ఆకుల్లో సహజంగా ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సాధారణ కీళ్లనొప్పులతో పాటు ఆర్థరైటిస్,రుమటాయిడ్ వంటి దీర్ఘకాల వ్యాధులను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇన్ని సుగుణాలున్న బిర్యాని ఆకుల టీ ని మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.