మన చుట్టూ ఉన్న పరిసరాల్లో సర్వసాధారణంగా కనిపించే జిల్లేడు మొక్కకు ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. జిల్లేడు మొక్క వేర్లు, ఆకులను ఉపయోగించి ఎన్నో రకాల మొండి వ్యాధులను నయం చేయవచ్చునని ఆయుర్వేద వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.జిల్లేడు పాలలో కొంత విషపదార్థం ఉంటుంది ఇది కూడా కొన్ని రకాల చర్మ సమస్యలను దూరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వీటిని నిపుణుల సూచనలు మేరకే ఉపయోగించాలి.ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు జిల్లేడు ఆకులను ఉపయోగించి వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చునని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తున్నారు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
సర్వ సాధారణంగా కనిపించే జిల్లేడు మొక్కల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ముఖ్యంగా ఎర్ర జిల్లేడు, తెల్ల జిల్లేడు, రాజు జిల్లేడు. వీటిలో తెల్ల జిల్లేడు మొక్కకి వైద్యంలో అధిక ప్రాముఖ్యత ఉంది. తెల్ల జిల్లేడు మొక్కని ఇంటి ఆవరణలో కూడా కొంతమంది పెంచుకుంటారు. తెల్ల జిల్లేడు మొక్క ఆకులను సేకరించి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఆకులను తీసుకొని ఉదయం పూట పాదాలకు కట్టుకొని సాయంత్రం తీసివేసి కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. అదే రాత్రి పడుకునేటప్పుడు కట్టుకుంటే ఉదయమే పాదాలకు ఉన్న ఆకులను తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. ప్రతిరోజు తాజా ఆకులను మాత్రమే ఉపయోగించాలి.
ఇలా పది రోజులపాటు చేస్తే జిల్లేడు ఆకుల్లోని ఔషధ గుణాలు రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యులకు చెబుతున్నారు.అయితే జిల్లేడు ఆకులను
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఇలాంటి చికిత్సకు దూరంగా ఉంటే మంచిది. జిల్లేడు ఆకులు తుంచి నప్పుడు వచ్చే పాలల్లో కొంత విష పదార్థం ఉంటుంది. ఈ పాలు కంట్లో పడితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కావున వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు జిల్లేడు ఆకులను దూరంగా ఉంచడం మంచిది.