Egg: పోషకాలిచ్చే కోడిగుడ్డు..! ఎక్కువ తింటే బెటర్..!!

Egg: గుడ్డు కోడిపిల్లగా పొదగాలంటే 21 రోజుల సమయం పడుతుంది. కానీ.. అలాంటి గుడ్లను ఒక కోడి నెలకు ఎన్ని పెడుతుందనే లెక్కపై పెద్దగా ఆలోచించం. ప్రస్తుత కరోనా సమయంలో మాంసం విక్రయాలు పెరిగాయి. వ్యాధినిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రజలు గుడ్లు, చికెన్, మటన్.. ఎక్కువగా తింటున్నారు. అయితే.. రోజూ వంటికి మసాలా పట్టించలేక కొంత.. తక్కువ ఖర్చుతో పోషకాలు లభ్యమయ్యే అవకాశం ఉండటంతో గుడ్డు తింటున్నారు. కొందరు ట్యాబ్లెట్లు, కాయగూరల ద్వారా పోషకాలు పొందుతున్నారు.

రీసెంట్ గా టీవీలో ఓ యాడ్ చూస్తున్నాం. క్రికెట్ దిగ్గజాలు గవాస్కర్, కపిల్ దేవ్, ద్రావిద్.. వంటి హేమాహేమీలతో గుడ్డు అందించే పోషకాలు, బలంపై మాత్రమే కాకుండా తినాల్సిన ఆవశ్యకతను చెప్తూ గుడ్లు తినమని చెప్తున్నారు. యాపిల్ కంటే రెండు రెట్లు అధికాంగా యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. రోజుకో గుడ్డు తినడం మంచిది. ఫైబర్, విటమిన్-సి తప్ప శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. ప్రస్తుత కరోనా సమయంలో మనకు రోగ నిరోధక శక్తి చాలా అవసరం. గుడ్లు తినడం వల్ల మెదడు పనితీరు.. పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది.

ఇంతగా మేలు చేసే గుడ్లు పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్ళు నెలకు 25-26 గుడ్లు పెడతాయి. మొత్తంగా ఏడాదిలో 305-310 గుడ్లు పెడతాయి. ఈ సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఇందుకు కోళ్లకు అందే దాణా పెంచే పద్ధతి కూడా ఇందుకు కారణమవుతాయి. ఇలా.. ఫౌల్ట్రీలో కోళ్లను పెంచే విధానంలో హచ్చుతగ్గులు కూడా గుడ్లు పెట్టే సంఖ్యపై తేడాలున్నట్టు చెప్తున్నారు. కోడి జీవితకాలంలో 75-80 వారాల పాటు గుడ్లు పెడితే.. హైబ్రిడ్ కోళ్ళు 100 వారాలు వరకూ పెడతాయి.

నాటుకోళ్లలో గుడ్లు పెట్టే సంఖ్య తక్కువే. అవి ఏడాదికి 150-200 గుడ్లు మాత్రమే పెట్టగలవు. నాటుకోళ్ల తీరు ఫారమ్ కోళ్ల తీరుకు భిన్నంగా ఉంటుంది. వీటికి డిమాండ్ కూడా ఎక్కువ. తినడం కంటే కోళ్లను పొదిగేలా చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మాంసంగా కూడా ఫారమ్ కోళ్ల కంటే నాటు కోళ్ల మాంసానికి డిమాండ్ ఎక్కువ. గుడ్లకు కూడా డిమాండ్ ఎక్కువ. ఎలా చూసినా గుడ్లు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.