బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గుండెను బలోపేతం చేయడం నుండి రక్తపోటును తగ్గించడం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం వరకు ప్రతిదీ ఇందులో ఉంటుంది. అయితే, బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి. బాదంపప్పును తీసుకునేటప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఈ పొరపాట్లను చేయకండి.
బాదంపప్పులో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి కాల్షియంతో కలిసి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. పెద్దలు ప్రతిరోజూ 2023 బాదంపప్పులను తినడం సురక్షితం అని నిపుణులు భావిస్తున్నారు. అయితే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి
రోజుకు కనీసం 2.5 లీటర్ల నీరు తాగాలి. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సమతుల్య ఆహారం, తగిన మొత్తంలో నీరుతో బాదంపప్పును తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, అధిక పరిమాణంలో తినవద్దు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. ఇవి మూత్రపిండాలు, మూత్ర నాళం, మూత్రాశయంలో ఏర్పడే గట్టి రాళ్లను కిడ్నీ స్టోన్స్ అంటారు. కిడ్నీ స్టోన్స్ సాధారణ సమస్య అని చెప్పవచ్చు. వెనుక, వైపు, దిగువ ఉదరం లేదా గజ్జల్లో పదునైన నొప్పులు ఉంటే జాగ్రత్త వహించాలి.