వేసవిలో చెమటకాయలు ఇబ్బంది పెడుతున్నాయా.. వీటికి చెక్ పెట్టే చిట్కాలివే!

చెమటకాయలు ఉన్నప్పుడు, చల్లటి నీటితో స్నానం చేయడం, చల్లని పెరుగును అప్లై చేయడం, మరియు గాలి తగిలేలా దుస్తులు ధరించడం వంటి చిట్కాలు ఉపయోగపడతాయి. అలాగే, చెమట పడకుండా చల్లటి వాతావరణంలో ఉండటం మంచిది. రోజూ రెండుసార్లు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల చెమటకాయలు తగ్గుతాయి. చెమటకాయలు ఉన్న ప్రాంతంలో చల్లని పెరుగును అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

చెమటకాయలు ఉన్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. గాలి తగిలేలా, రంధ్రాలు ఉన్న దుస్తులు ధరించండి. పాలిస్టర్ మరియు బ్లెండెడ్ ఫాబ్రిక్స్ నివారించాలి. వేడి వాతావరణంలో ఎక్కువసేపు ఉండకుండా, చల్లటి ప్రదేశాల్లో ఉండటం మంచిది. శరీరానికి తగినంత నీరు ఇవ్వడం వల్ల చెమట పడకుండా ఉంటుంది. మూడు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టిలో రెండు టీ స్పూన్ల పుదీనా పేస్ట్ కలిపి, చల్లని పాలుతో పేస్ట్ చేసి చెమటకాయల మీద అప్లై చేస్తే మంచిద్

గంధానికి చల్లని ఫుల్ ఫ్యాట్ మిల్క్ కలిపి ఆ మిశ్రమాన్ని చెమటకాయలు ఉన్న ప్రదేశం లో పట్టించి గాలికి ఆరనివ్వాలి. చిరు చిరులాడే చెమట కాయలు మంటెక్కించడంతో పాటు హాట్ సమ్మర్ లో ఇది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. చెమటకాయల కారణంగా దురద పెట్టి.. చికాకుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

నుదుటిపై, ముఖం, మెడ, వీపు, ఛాతీ, తొడల మీద చెమట కాయలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చర్మం ఎర్రపొక్కులుగా మారటం, గోకటం వల్ల చర్మం చిట్లి రక్తం కారడం కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో దొరికే వస్తువులతోనే  చెమటకాయలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది.