ఈ మసాలా పానీయాన్ని ప్రతిరోజు సేవిస్తే … సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది?

ప్రతిరోజు ఉదయాన్నే వేడి వేడి టీ, కాఫీ వంటి పానీయాన్ని సేవిస్తే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము ముఖ్యంగా చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా శరీర జీవక్రియలు మందగించి కండరాలు, కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తాయి, కొలెస్ట్రాల్ సమస్య కూడా అధికంగానే ఉంటుంది. వాతావరణం లో అధిక తడి కారణంగా ప్రమాదకర సూక్ష్మజీవుల తాకిడి కూడా మన ఇమ్యూనిటీ సిస్టంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కావున ఇలాంటి సమయాల్లో కేవలం కాఫీ ,టీ వంటి పానీయాలకు బదులు ఎన్నో ఔషధ గుణాలు పోషక విలువలు సమృద్ధిగా లభించి రోజ్ మసాలా చాయ్ సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సహజ పద్ధతిలో పొందవచ్చు.

రోజ్ మసాలా చాయ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పాలల్లో టీ పొడి పొడితో పాటు ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు గులాబీ రేకలూ, ఒక స్పూన్ తులసి పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, రెండు యాలకుల్ని వేసి 20 నిమిషాలు బాగా మరిగించాలి. మరిగిన తరువాత వచ్చిన కషాయాన్ని వడగట్టుకుని అందులో రుచి కోసం తేనెను కలిపితే వేడివేడి రుచికరమై రోజ్ మసాలా చాయ్ సిద్ధమైనట్లే. చల్లటి వాతావరణంలో వేడి వేడి రోజ్ మసాలా చాయ్ సేవిస్తే శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది.

రోజ్ మసాలా చాయ్ లో ఉపయోగించి తులసి సుగంధ ద్రవ్యాలైన దాల్చిన చెక్క మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీర జీవక్రియలను నియంత్రించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్గా వచ్చే అలర్జీలను ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి చెడు మలినాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. గులాబీ రేకుల్లో ఉన్న విటమిన్ ఏ విటమిన్ సి పొడి వారిన చర్మాన్ని సరిచేసి చర్మాన్ని కాంతివంతంగా మరియు మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. మసాలా చాయ్ లోని సహజ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి ఉబకాయం, గుండె పోటు, రక్తపోటు డయాబెటిస్ వంటి వ్యాధుల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.