ప్రతిరోజు ఈ కషాయాన్ని సేవిస్తే పది రకాల వ్యాధులకు స్వస్తి పలకవచ్చు… ఎలాగంటే?

guava_leaves_for_hair_(1)_1630311984522_1630311995003

ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరంగా జామ చెట్లను భావించవచ్చు.జామ చెట్లు రుచికరమైన, ఆరోగ్యవంతమైన జామ పండ్లను అందించడమే కాకుండా జామ ఆకుల్లో, జామ బెరడులో దాగి ఉన్న ఎన్నో ఔషధ గుణాలు డయాబెటిస్, రక్త పోటు, చెడు కొలెస్ట్రాల్, చిగుళ్ల సమస్యలు, దగ్గు, జలుబు వంటి అనేక అనారోగ్య సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తోంది. జామ ఆకుల్లో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, ప్లవనాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉండడంతోపాటు కాల్షియం
పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ లాంటి ఎన్నో పోషకాలు మెండుగా లభిస్తాయి.

ప్రతిరోజు జామ ఆకులతో రుచికరమైన టీ తయారు చేసుకుని సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది వైరల్ ,బ్యాక్టీరియల్ ఫ్లూ లక్షణాల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా జలుబు, గొంతు నొప్పి, దగ్గు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు జామ ఆకుల కషాయాన్ని తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. మరియు నోట్లో ఇన్ఫెక్షన్ కారణంగా నాలుక పై పుండ్లు, చిగుళ్లలో రక్తం కారడం, పంటి నొప్పి సమస్యలతో బాధపడేవారు జామ ఆకుల కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే జామ ఆకుల్లో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు ప్రమాదకర మైక్రోబ్స్ ను నియంత్రించడంలో సహాయపడతాయి.

చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు నాలుగు జామ ఆకులను బాగా మరిగించి వచ్చిన కషాయాన్ని రోజుకు రెండు పూటలా సేవిస్తే జామ ఆకుల్లో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది తద్వారా ఉబకాయం,రక్తపోటు సమస్యలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కూడా ప్రతిరోజు జామ కషాయాన్ని సేవిస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గి డయాబెటిస్ వ్యాధి అదుపులోకి వస్తుంది. క్యాన్సర్ నియంత్రణలో కూడా జామ కషాయం అద్భుతంగా పనిచేస్తుంది.