మలబద్ధకం సమస్యతో బాధ పడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

constipation-1-1600x900

ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మలబద్ధకం సమస్య వేధిస్తోంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. తరచూ ఈ సమస్య వేధిస్తుంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. ఎవరైతే నీళ్లు తక్కువగా తాగుతారో వాళ్లను ఈ సమస్య వేధిస్తుంది. తరచూ వ్యాయామం చేయడం ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

 

జీర్ణ సంబంధిత సమస్యల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మలబద్ధకం సమస్య వేధించే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీ బయోటిక్ ఫైబర్స్ ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉల్లిపాయలు, అరటిపండ్లు, వెల్లుల్లి కూడా మలబద్ధకం సమస్య దూరం కావడంలో ఎంతగనో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

 

అజీర్తి, మలబద్ధకం సమస్యలు చిన్న సమస్యలలా అనిపించినా ఆ సమస్యల వల్ల ఎంతోమంది నరకం అనుభవిస్తున్నారు. పీచు ఎక్కువగా ఉండే చపాతీ లాంటి ఆహారాలను డైట్ లో భాగం చేసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. 5 బాదం పప్పులు, 1 వాల్ నట్, ఎండు ద్రాక్షలను నానబెట్టి తింటే కూడా ఈ సమస్య దూరమవుతుంది.

 

అంజీరా, ఖర్జూరం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందవచ్చు. బొప్పాయి పండ్లు తినడం ద్వారా కూడా మలబద్ధకం సమస్య దూరమవుతుంది. రాత్రి సమయంలో ఫలావు తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.