కండ్ల కలక ఏ విధంగా వస్తుంది.. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధులలో కండ్ల కలక ఒకటి కాగా ఈ వ్యాధి బారిన పడితే ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వర్షాకాలంలో కండ్లకలకకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదు కావడం జరుగుతుంది. వర్షాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది.

వైరస్, బ్యాక్టీరియా, అలర్జీ వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధి కొన్నిసార్లు చూపుపై ప్రభావం చూపుతుంది. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే తక్కువ సమయంలో ఈ వ్యాధికి చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కండ్ల కలక వచ్చిన వారి వస్తువులను మనం వాడినా కరచాలనం చేసి ఆ చేతిని తాకినా ఈ వ్యాధి వస్తుంది.

స్కూళ్లలో ఒక్కరికి ఈ వైరస్ సోకినా మిగతా వాళ్లకు సైతం వేగంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో మంట, కనురెప్పలు అతుకున్నట్టు అనిపించడం, కళ్లు వాపు రావడం, కళ్ల నుంచి చిక్కని ద్రవం కారడం, వెలుతురును చూడలేకపోవడం, ఇతర కారణాలు ఉంటాయి. ఈ వ్యాధి వచ్చిన వాళ్లు కండ్లు నలపడం చేయకూడదు. గోరువెచ్చని నీళ్లతో కళ్లను శుభ్రం చేసుకోవాలి.

నల్లటి అద్దాలు ధరించి వేరే వాళ్లు గదిలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాడిన వస్తువులను ఇతరులు వాడకుండా జాగ్రత్త పడాలి. అడినో వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఐ డ్రాప్స్, యాంటీ బయోటిక్స్ వాడటం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కండ్ల కలక వచ్చిన తర్వాత ఇబ్బంది పడటానికి బదులుగా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.