కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివే…. మరి చలికాలంలో తాగితే ఏమవుతుందో తెలుసా?

కొబ్బరి నీళ్లల్లో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ మంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి కావున మనలో అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొబ్బరి నీళ్లను సేవిస్తే తక్షణ శక్తి లభించి త్వరగా కోలుకుంటారు. అయితే కొబ్బరినీళ్లను అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్న శీతాకాలంలో సేవిస్తే జలుబు,దగ్గు,గొంతునొప్పి సమస్యలు తలెత్తుతాయని భావించి తాగడానికి మక్కువ చూపించరు. ఇది కేవలం అపోహ మాత్రమే ఇందులో ఎటువంటి వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు.

సకల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కొబ్బరినీళ్ళను ఏడాది పొడవునా అన్ని సీజన్లలో నిక్షేపంగా తాగవచ్చు
ముఖ్యంగా శీతాకాలంలో కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది తద్వారా రోగ నిరోధక శక్తి పెంపొంది ప్రమాదకర వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రచించడంలో సహాయపడుతుంది. సాధారణంగా శీతాకాలంలో శరీర జీవక్రియ రేటు మందగించి అవయవాల పనితీరు సరిగా ఉండదు దాంతో మనలో అలసట, నీరసం చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే ప్రతి రోజు కొబ్బరినీళ్లు తాగాల్సిందే.

చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా కండరాలు బిగిసుకుపోయి రక్తప్రసరణ వ్యవస్థ మందగిస్తుంది కావున అత్యధిక పొటాషియం ఉన్న కొబ్బరినీళ్లను సేవిస్తే రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడి, అవయవాలకు అవసరమైన ఆక్సిజన్ కూడా సక్రమంగా అందుతుంది. హై బీపీ సమస్యను అదుపులో ఉంచుతుంది.చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్‌లో కొబ్బరి నీళ్లను తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడి పొడిబారిన చర్మం సమస్య నుంచి మనల్ని రక్షిస్తుంది.