మనలో చాలామంది డైట్ లో భాగంగా చియాసీడ్స్ ను తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు సులువుగా లభించే అవకాశాలు ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలకు, ఎముకల సమస్యలకు చియా సీడ్స్ సహాయంతో సులభంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
బరువు తగ్గాలని భావించే వాళ్లు, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఫీలయ్యే వాళ్లు చియా సీడ్స్ ను తీసుకుంటే మంచిది. రక్తంలో చక్కెర నిర్వహణను మెరుగుపరచడంతో పాటు బలమైన ఎముకలను నిర్మించడంలో ఈ సీడ్స్ తోడ్పడతాయి. స్మూతీ, సలాడ్స్, డిష్ లలో చియా సీడ్స్ ను ఎక్కువగా వాడటం జరుగుతుంది. బరువు తగ్గాలని భావించే వాళ్లకు చియా సీడ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతాయని చెప్పవచ్చు.
చియా సీడ్స్ ను తీసుకోవడం ద్వారా బొడ్డు కొవ్వును సులువుగా తగ్గించే చియా సీడ్స్ తోడ్పడతాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చియా గింజల్లో అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు ఉన్నవాళ్లు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంలో ఈ సీడ్స్ తోడ్పడతాయి.
చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం లభించే అవకాశాలు ఉంటాయి. బోలు ఎముకల వ్యాధి సమస్యతో బాధ పడేవాళ్లు చియా సీడ్స్ ను తీసుకోవడం ద్వారా ఆ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంతో పాటు చియా సీడ్స్ ద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయి.