ప్రతిరోజు రాజ్మా బీన్స్ తినొచ్చా? తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసా?

మనకు సంపూర్ణ పోషకాలను అందించడంలో రాజ్మా గింజలు అద్భుతంగా సహాయపడతాయని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. రాజ్మా గింజలు నలుపు ఎరుపు రంగులో ఉండి కిడ్నీ ఆకారంలో ఉండడం వల్ల వీటిని కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు.రాజ్మా బీన్స్ లో అధిక మొత్తంలో ప్రోటీన్స్, పీచు పదార్థం, అమైనో ఆమ్లాలు,కార్బోహైడ్రేట్స్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, పాస్పరస్, ఫైబర్, సోడియం,ఫోలేట్, కాల్షియం వంటి సహజ మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. తరచూ రాజ్మా గింజలను ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాజ్మా సీడ్స్ లో క్యాలరీలు తక్కువగా ఉండి, ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. కావున శరీర బరువును తగ్గించుకోవాలనుకున్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే బరువు తక్కువగా ఉన్నవారు వీటిని తింటే అత్యధిక ప్రోటీన్స్ లభ్యమవుతాయి కాబట్టి శారీరకంగా దృఢంగా తయారవుతారు.కండర పుష్టి కలుగుతుంది. రాజ్మా గింజల్లో అత్యధికంగా లభించే కాల్షియం ఫాస్ఫరస్ ఎముక దృఢత్వానికి పెరుగుదలకు సహాయపడుతుంది.రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ పుష్కలంగా లభించి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడి శరీరానికి శక్తిని బలాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.

రాజ్మా గింజల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తగ్గించి కణాల అభివృద్ధిలో సహాయపడడమే కాకుండా క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచి రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. రాజ్మా గింజల్లో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి శరీర బరువును నియంత్రిస్తుంది. రాజ్మా గింజల్లో సమృద్ధిగా లభించే మెగ్నీషియం నరాల బలహీనతను తొలగించి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.