శీతాకాలంలో సాధారణంగానే అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మన శరీర జీవక్రియ రేటు కొంత మందగించి మనలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే శీతాకాలంలో తీసుకునే ఆహారం విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి. అసలే చలికాలం దానికి తోడు మన శరీర ఉష్ణోగ్రతలను తగ్గించే అరటి పండ్లను చలికాలంలో తినొచ్చా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. అరటి పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు.అరటి పండ్లలో సమృద్ధిగా క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ,ఫైబర్ విటమిన్ ఏ, సహజ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి.
అరటి పండ్లను చలికాలంలో తినొచ్చా అంటే నిక్షయాభంగా తినొచ్చు అంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు అరటి పండ్లను ఎప్పుడు తిన్నా మన ఆరోగ్యానికి మంచిదే అయితే మోతాదుకు మించి తీసుకోకూడదు. అలాగే దగ్గు, జలుబు, నిమోనియా, గొంతు నొప్పి, ఆస్మా సమస్యలతో బాధపడేవారు అరటి పండ్లను రాత్రిపూట తినకపోవడమే మంచిదని చెబుతుంటారు.నిద్రపోయే ముందు అరటిపండు తింటే శ్లేష్మం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆస్మా ,ఉబ్బసం, టిబి లక్షణాలతో బాధపడేవారు చలికాలంలో అరటి పండ్లకు కొంత దూరంగా ఉండడమే మంచిది. మోతాదుకు మించి తింటే సమస్య మరీ తీవ్రంగా మారే ప్రమాదం ఉంది
ప్రతిరోజు ఒక అరటిపండును తింటే మన శరీరానికి అవసరమైన 100 కేలరీల శక్తి లభిస్తుంది. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు అరటి పండ్లను ఎక్కువగా తింటే ముఖ్యంగా రాత్రి సమయంలో అరటిపండు తింటే జీర్ణం అవ్వడానికి సమయం పట్టి రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతాయి దాంతో డయాబెటిస్ అదుపులో ఉండదు. అలాగే దంత సమస్యల, మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు అరటిపండును తినే విషయంలో వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. చిన్నపిల్లలకు రోజుకు ఒక అరటిపండు తినిపిస్తే శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారు. అయితే జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యతో బాధపడుతుంటే మాత్రం రాత్రి సమయాల్లో అరటిపండును తినిపించకపోవడమే మంచిది.