ఉదయాన్నే బ్రష్ చేయకుండా మంచి నీళ్లు తాగొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Young,Woman,Drinks,Glass,Of,Pure,Water,In,Morning,After

ఒక్కోసారి కొన్ని విషయాలు విన్నప్పుడు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా దాదాపుగా అలాంటిదే. అసలు విషయం ఏమిటంటే ఉదయాన్నే నోటిని శుభ్రం చేసుకోకుండా మంచినీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరి కొందరి వాదన ప్రకారం ఉదయాన్నే బ్రష్ చేసుకోకుండా మంచినీళ్లను తాగితే రాత్రంతా మన నోట్లో వృద్ధి చెందిన ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్లు పొట్టలోకి ప్రవేశించి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు.

 

తాజా పరిశోధనల ప్రకారం రాత్రి పడుకున్న తర్వాత మన నోట్లో వేల సంఖ్యలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్న విషయం వాస్తవమే అయినప్పటికీ ఉదయాన్నే బ్రష్ చేసుకోకుండా మంచినీళ్లను తాగినప్పుడు ఆ బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశించిన ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తకపోగా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని తేలింది. అలాగే ఈ బ్యాక్టీరియా జీర్ణక్రియను పెంచి జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుందని చెబుతున్నారు.ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బ్రష్ చేయకుండా మంచినీళ్లను తాగే వారిలో రక్తపోటు,గుండె జబ్బు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి.

 

ఏది ఏమైనప్పటికీ మన శరీరంలోని నిత్య జీవక్రియలు సక్రమంగా జరగాలంటే తగినంత నీరు తాగడం తప్పనిసరి. వైద్యుల సూచన ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు ఐదు నుంచి ఆరు లీటర్ల నీటిని తాగడం ఎంతో ముఖ్యం.అతి బరువు, ఉబకాయ సమస్యతో బాధపడేవారు ఉదయం అల్పాహారానికి ముందు నీరు తాగడం వల్ల 13 శాతం తక్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల మన శరీరానికి అత్యల్ప క్యాలరీలు లభించి సహజ పద్ధతిలో శరీర బరువును నియంత్రించుకోవచ్చు.