కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. మొదటి వెవ్ లో covid 19 , రెండవ వేవ్ లో డెల్టా వేరియంట్ అని అందరినీ ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో మొదలై దాదాపు అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించి అందరినీ కలవరపెడుతోంది. కరోనా తగ్గిపోయి సాధారణ పరిస్థితి వస్తుంది అనే సమయంలో ఈ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను ఉలిక్కి పడేలా చేసింది.
ఇప్పటికే ప్రపంచ దేశాలు అన్ని ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. ఆర్థిక నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఎక్కువ సంఖ్యలో ఉంది.ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసులలో చాలామందికి ఒళ్లునొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతి తక్కువ మందిలో మాత్రమే దగ్గు, గొంతులో గరగర ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒమిక్రాన్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించి సామాజిక దూరం పాటించాలి. తరచు చేతులు శుభ్రంగా కడుక్కొని సానిటైజర్ తప్పని సరిగా ఉపయోగించాలి .
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణురాలు డా.ఏంజెలిక్ కోయొట్జ్ మాట్లాడుతూ తమ దేశంలోని చాలామంది సాధారణ వైద్యంతోనే ఒమిక్రాన్ నుండి ఉపశమనం పొందుతున్నారు అని చెప్పారు. ఆమె చెప్పిన ప్రకారం రోగ నిర్ధారణ అయిన తర్వాత తక్కువ మోతాదులో కార్టిసోన్, ఐబూప్రోఫెన్ వంటివి వాడటం ద్వారా ఓమిక్రాన్ కు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తప్ప మరి ఇతర మందులు వాడాల్సిన పనిలేదని ఆమె సలహా ఇచ్చారు. టీకా తీసుకున్నవారిలో వ్యాధి సంక్రమణ కొంచెం తక్కువగా ఉంటుందని , కరోనా టీకా తీసుకొని వారికి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె చెప్పారు. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఈ వేరియంట్ చిన్న పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపదని ఆమె చెప్పారు.