పుట్టగొడుగులను ఎక్కువగా తినొచ్చా.. తింటే మన శరీరానికి లాభమా నష్టమా?

ఒకప్పుడు సీజనల్ గా మాత్రమే లభించే పుట్టగొడుగులు ప్రస్తుత రోజుల్లో ఏడాది పొడవునా ఆహారంగా తీసుకోవడానికి అందుబాటులో ఉండి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
పుట్టగొడుగుల్లో అనేక రకాలు ఉన్నప్పటికీ మనకు బటన్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్ వంటివి మాత్రమే మార్కెట్లో ఎక్కువగా లభ్యమవుతుంటాయి.
పుట్టగొడుగుల్లో సమృద్ధిగా ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా పుట్టగొడుగుల్లో క్యాలరీలు కొలెస్ట్రాల్ తక్కువగా లభ్యం అవుతుండడం వల్ల వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య తలెత్తే అవకాశాలు శూన్యం అనే చెప్పొచ్చు.

పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయాటిక్ గుణాలు మెండుగా లభ్యమవుతాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించి రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పుట్టగొడుగులు పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది ఇవి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని అన్ని అవయవాలకు సరిపడా ఆక్సిజన్ ను రక్త నిల్వలను అందించడంలో సహాయపడుతుంది.

గర్భిణీ మహిళలు, పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్న పిల్లల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గి తరచూ నీరసం అలసట, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలతో బాధపడేవారు ఐరన్, విటమిన్ బి12, పోలీస్ ఆమ్లం సమృద్ధిగా లభించే పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్య నుంచి మనల్ని రక్షిస్తుంది. పుట్టగొడుగుల్లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ , ప్రోటీన్స్ సమృద్ధిగా లభించి మన శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి. పుట్టగొడుగులు ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ ఏ కణాల అభివృద్ధికి తోడ్పడి చర్మంలోని మృత కణాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కొందరిలో మాత్రం పుట్టగొడుగులను ఎక్కువగా తింటే కొన్ని అలర్జీ సమస్యలు తలెత్తవచ్చు .వీరు తప్పనిసరిగా వైద్య సలహాలు సూచనలు పాటించి పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవచ్చు.