మానసిక రుగ్మతలను తరిమికొట్టే పుట్టగొడుగులు! ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు?

కొన్ని రకాల పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే వాటిల్లో ఉండే ఔషధ గుణాల కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.అసలు మానసిక ఒత్తిడికి గల కారణాలను పరిశీలిస్తే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కాలంతో పోటీపడి జీవనం సాగించడం వల్ల క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, అనారోగ్య కారణాలు,కుటుంబ,ఆర్థిక కారణాలు, డ్రగ్స్, మద్యపానం ,దుమాపానం వంటివి ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు.

సాధారణంగా మానసిక రుగ్మతలతో బాధపడే వారికి సైకోథెరపీ ట్రీట్మెంట్ ను వైద్యులు ఇస్తుంటారు.అయితే ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా చాలామంది డిప్రెషన్ లక్షణాలు తగ్గవు. అయితే రోజుకు 25గ్రా సిలోసిబిన్ మ్యాజిక్ పుట్టగొడుగులు ఆహారంగా తీసుకున్నవాళ్లలో మానసికంగా స్థిరత్వం ఏర్పడి డిప్రెషన్ సమస్య తగ్గిందని పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నారు.సిలోసిబిన్‌ మ్యాజిక్ పుట్టగొడుగు లోని సైకోయాక్టివ్ పదార్థాలు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసే నాడీ కణ వ్యవస్థ పై మరియు మెదడు భాగాలపై ప్రభావంతంగా పనిచేసి మనలోని మానసిక ఒత్తిడిని, డిప్రెషన్ వంటి లక్షణాలను తగ్గించడంలో తోడ్పడతాయి.

రోజువారి డైట్ లో పుట్టగొడుగులు తింటే మన శరీరానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి తద్వారా మనలో ఇమ్యూనిటీ సిస్టం అభివృద్ధి జరిగి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే పుట్టగొడుగులు నిద్రలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపడమే కాకుండా మనలో మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడు చురుకుదనాన్ని జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పూజిస్తాయి.