థైరాయిడ్ సమస్యను రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటితో అదుపు చేయవచ్చా..? ఇందులో నిజం ఎంత?

ప్రస్తుత కాలంలో మనలో తలెత్తే అనేక అనారోగ్య సమస్యలకు మూలం ప్లాస్టిక్ వినియోగం అధికం కావడమేనని చాలా అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. మనకే కాదు ఈ భూమిపై ఉండే సమస్త జీవకోటికి ప్లాస్టిక్ వినియోగం శాపంగా మారుతోంది. ఈ రోజుల్లో తాగే నీటిని తినే ఆహార పదార్థాలన్నీ ప్లాస్టిక్ వస్తువుల్లోనే నిల్వ చేసుకొని వినియోగించడం జరుగుతోంది. నీటిని ఎక్కువ రోజులు ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చేయడం వల్ల ప్లాస్టిక్ లో ఉండే రసాయనాలు నీటిలో కలిసి ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్ల వ్యాప్తికి కారణమై మనలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ సమస్యల నుంచి బయట పడాలంటే రోజువారి వినియోగంలో రాగి పాత్రల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు రాగి పాత్రల విశిష్టతను గుర్తించి నీటిలోని సూక్ష్మజీవులను నశింపజేయడానికి రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచుకొని తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. రాగి పాత్రలపై సూర్యకిరణాలు పడినప్పుడు సూర్య కిరణాలతో రాగి ఖనిజం లోని ఔషధ గుణాలు రసాయన చర్య జరగడం వల్ల నీటిలోని ప్రమాదకర సూక్ష్మజీవులు నశిస్తాయి.

రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిలో ప్రమాదకర సూక్ష్మజీవులు నశించి పోవడమే కాకుండా కాపర్ వంటి ఖనిజలవణాలు సమృద్ధిగా లభిస్తాయి.మన శరీరంలో కాపర్ నిల్వలు తక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే నీటిలోని అయానికత వల్ల శరీరంలో కాపర్ సమృద్ధిగా లభించి థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా థైరాయిడ్ సమస్యను అధిగమించవచ్చు.ఎముకల సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే ఎముకలు దృఢంగా తయారై కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ , ఆర్థరైడ్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

మెదడు సంబంధిత రుగ్మతలను తొలగించి జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలంటే రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి తాగాలని నిపుణులు చెబుతున్నారు కారణం మెదడు అభివృద్ధికి, రక్షణకు సహాయపడే న్యూరాన్ కణాలకు కవచంలా ఉపయోగపడే మైలిన్ తొడుగులు తయారుకావడానికి కాపర్ మూలకం సహాయపడుతుంది. రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచితే ప్రమాదకర టైఫాయిడ్ ,డయేరియా వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లను నశింప చేస్తుంది.