శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ రాగి పాత్రలలోనే నైవేద్యం పెట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా…?

త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు ని ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సిరిసంపదలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని ప్రజల నమ్మకం. అయితే మనం శ్రీమహావిష్ణువు  అక్కడి అర్చకులు శ్రీమహావిష్ణువు కి రాగి పాత్ర లో నైవేద్యం పెట్టడం మనం గమనించవచ్చు. సాధారణంగా ఇతర ఆలయాల్లో వెండి, ఇత్తడి పాత్రలలో లేదా ఆకులలో దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. కేవలం శ్రీమహావిష్ణువు ఆలయంలో మాత్రమే రాగి పాత్రలలో నైవేద్యం పెట్టడమే కాకుండా తీర్థం ఇవ్వటానికి కూడా రాగి పాత్రలనే ఉపయోగిస్తారు. అయితే మహావిష్ణువు ఆలయంలో ఇలా కేవలం రాగి పాత్రలను మాత్రమే ఉపయోగించటానికి గల రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

హిందూ పురాణాల ప్రకారం పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని పుట్టుక రాక్షస పుట్టుకైనా శ్రీమహావిష్ణువుకి పరమ భక్తుడు. నిత్యం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండేవాడు. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఆ రాక్షసుడు  పదహారువేల సంవత్సరాలు తపస్సు చేశాడు. గుడాకేశుడి తపస్సును మెచ్చిన విష్ణు మూర్తి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు.

 

దానికి గుడాకేశుడు తాను కొన్నివేల జన్మలపాటు విష్ణుభక్తి లో మునిగి పోయే విధంగా వరాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. తన మరణం విష్ణు చక్రం వలన సంభవించాలి అని, తన మరణానంతరం శరీరం రాగి లోహం లాగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణు ఆ రాక్షసుడు కోరికలను అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు.

 

అనంతరం కూడా గుడాకేశుడు విష్ణుమూర్తి ధ్యానంలోనే తపస్సు చేస్తూ ఉండిపోయాడు. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు ఆ రాక్షసుడి కోరిక తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుని మిట్ట మధ్యాహ్నం సమయంలో తన చక్రాయుదాన్ని ప్రయోగించాడు. ఆయుధం గుడాకేశుడి శిరస్సును ఖండించింది. వెంటనే అతని శరీరం రాగి ముద్దలా, ఎముకలు వెండిలాగా, మలినాలు కంచు లోహం లాగా మారిపోయాయి. గుడాకేశుడి శరీరం నుండి తయారైన రాగి ఒక పాత్రల తయారింది. తన భక్తుడి మరణానంతరం ఏర్పడిన పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడానికి శ్రీమహావిష్ణువు ఇష్టపడతారు. రాగి పాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో అన్నివేల సంవత్సరాలు నైవేద్యాన్ని పెట్టినా భక్తులు వైకుంఠంలో ఉండగలరని శాస్త్రాలు చెబుతున్నాయి.