బరువు తగ్గాలనుకునే వారు రోటీలను తినొచ్చా.. న్యూట్రిషన్ వైద్యులు సలహా ఏమిటంటే?

ఈ రోజుల్లో వృత్తిరీత్యా ఇంట్లో ఆహారాన్ని తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. బయట దొరికే అధిక క్యాలరీలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి అతి బరువు సమస్య, స్థూల కాయం, రక్తపోటు, షుగర్, గుండె జబ్బు వంటి సమస్యలతో దీర్ఘకాలం పాటు బాధపడుతున్నారు. దీంతో చాలామంది రోజువారి ఆహారంలో డైట్ ను ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తూ ఏ ఆహారాన్ని తీసుకోవాలి ఏది తినకూడదు అన్న సందేహంలో ఏవేవో ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతుంటారు అలాంటి వారికి సందేహాలను తీర్చడానికి ప్రఖ్యాత న్యూట్రిషన్ వైద్యులు కొన్ని సలహాలను సూచిస్తున్నారు.

అతి బరువు, దీర్ఘకాయ సమస్యలతో బాధపడుతున్న వారు తమ రోజువారి ఆహారంలో తక్కువ క్యాలరీలో ఉన్న రోటీని ఆహారంలో డైట్ గా చేర్చుకోవచ్చు ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి రోటీ ఉత్తమ ఎంపిక అని ప్రముఖ న్యూట్రిషన్ వైద్యులు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగని మరి ఎక్కువ రోటీలను ఒకేసారి తిన్నా కూడా శరీరంలో క్యాలరీల పరిమాణం పెరుగుతుంది. దాంతో మీరు డైట్ ఫాలో అయినా కూడా ఎటువంటి ఫలితాలు ఉండవు. 40 గ్రాములు ఉండే మీడియం సైజు రోటి తో మనకు 120 క్యాలరీలు లభిస్తాయి. దీని ప్రకారం పురుషులకు రోజుకు 1700 కేలరీలు అవసరమవుతాయి. కాబట్టి పురుషులు లంచ్ మరియు డిన్నర్‌లో మూడు రోటీలు తినవచ్చు.మహిళలకు రోజుకు 1400 కేలరీలు అవసరం కావున లంచ్ మరియు డిన్నర్‌లో రెండు రోటీలు తినవచ్చు. రోటీలతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలతో చేసిన కర్రీ ,సలాడ్‌ని కూడా రోటీతో కలిపి తీసుకోవచ్చు.

కొంతమంది రోటీలకు బదులు బ్రెడ్ ను ఆహారంగా తీసుకుంటున్నారు. బ్రెడ్ లో అత్యధిక కేలరీలు ఉంటాయి. పైగా బ్రెడ్‌లో విటమిన్ B1 ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ మరియు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. అధిక క్యాలరీల వల్ల శరీర బరువు , రక్తంలో గ్లూకోస్ స్థాయిలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులైతే రోజువారి ఆహారంలో
మల్టీగ్రెయిన్ రోటీని తినడం మంచిది. ఇందులో
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు స్థిరంగా ఉండి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. కావున అతి బరువు సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా రోటీలను తమ డైట్లో చేర్చుకోవచ్చని న్యూట్రిషన్ వైద్యులు సూచిస్తున్నారు.