ఈ ఆకు కషాయంతో తీవ్రమైన దగ్గు సమస్యను తరిమికొట్టవచ్చు?

ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధ మొక్కలలో కర్పూరవల్లి మొక్క ప్రధానమైనది గానే చెప్పొచ్చు. కర్పూరవల్లి మొక్కను కొన్ని ప్రాంతాల్లో వాము చెట్టు, కప్పరిల్లాకు అనే పేర్లతో ఎక్కువగా పిలుస్తుంటారు. కర్పూరవల్లి మొక్కలు మన ఇంటి పెరట్లో చక్కగా పెరుగుతాయి. ఈ మొక్క ఆకుల్లో మరియు కాండంలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కావున ఈ మొక్క ఆకుల కషాయాన్ని సేవిస్తే అనేక దీర్ఘకాలిక వ్యాధులను సైతం నియంత్రించవచ్చునని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

కర్పూరవల్లి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కావున ఈ ఆకుల్లో కొంత ఉప్పు వేసి బాగా నమిలి ఆ రసాన్ని మింగితే తీవ్రమైన దగ్గు, జలుబు, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, కప్పం వంటి సమస్యలు తొలగిపోతాయి. కర్పూరవల్లి ఆకు రసాన్ని తీసి గోరువెచ్చగా చేసుకొన్న తర్వాత సేవిస్తే సైనస్ వంటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుంది.

కర్పూరవల్లి ఆకులు యాంటీ ఆక్సిడెంట్, ఒమేగా ఆమ్లాలు, యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుల కషాయాన్ని సేవిస్తే మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నశింపజేయడంలో సహాయపడి అనేక రకాల క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ ఆకుల్లోని ఔషధ గుణాలు నాడీ కణ వ్యవస్థను ప్రేరేపించి మనలో మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు తరచూ ఈ ఆకు కషాయాన్ని సేవిస్తే మన శరీరంలోని సోడియం నిల్వలను తగ్గించడంతోపాటు కిడ్నీలో రాళ్లను కరిగించి మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.మూత్రశయ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు తరచు ఈ ఆకుల కషాయాన్ని సేవిస్తే వీటిలో ఉన్న ఔషధ గుణాలు ప్రమాదకర సూక్ష్మ జీవులను నశింపజేసి మూత్రశయ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

ఆకలి మందగించడం, అజీర్తి, కడుపులో పుండ్లు వంటి సమస్యలతో బాధపడేవారు కర్పూరవల్లి ఆకులను తిన్న లేదా ఈ ఆకుల కషాయాన్ని ప్రతిరోజు సేవించిన మనలో అరుగుదల శక్తి పెరిగి అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. అలాగే కడుపులోని ప్రమాదకర బ్యాక్టీరియాలను నశింపజేసి కడుపు మంటను తగ్గిస్తుంది. ఆస్మా, ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడేవారు కర్పూరవల్లి ఆకులను బాగా నలిపి దాని వాసన పీల్చుకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తొలగిపోతుంది.