చలికాలం సీజన్లో మాత్రమే ఎక్కువగా లభించే చిలగడ దుంపలను ఆహారంగా తీసుకోవడానికి చాలామంది మక్కువ చూపిస్తుంటారు. వీటిని ఇంగ్లీషులో స్వీట్ పొటాటో అని పిలుస్తారు. ఇంకొన్ని చోట్ల గంజి గడ్డలు అని కూడా పిలుస్తుంటారు. చిలగడ దుంపలను సాధారణంగా ఉడకబెట్టుకొని ఎక్కువగా తింటుంటారు
చలికాలం సీజన్లో వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. చిలకడదుంపల్లో పుష్కలంగా కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం వంటి అనేక సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
చిలగడ దుంపలను చలికాలం సీజన్లో ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో వేడిని పెంచే సహజ గుణాలు పుష్కలంగా ఉంటాయి కావున. వీటిని తప్పనిసరిగా తినాలని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. దాంతోపాటు చిలగడ దుంపలు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు చలికాలంలో పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున ఐరన్ మూలకాన్ని ఎక్కువగా గ్రహించి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
చిలకడదుంపల్లో పుష్కలంగా పీచు పదార్థం ఉండి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మనం తీసుకునే ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి ప్రేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను కూడా దూరం చేస్తుంది. శీతాకాలంలో తడి వాతావరణం కారణంగా కళ్ళు పొడిబారడం ఎర్రబడడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. చిలగడ దుంపలను పచ్చిగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉండే బీటాకేరోటిన్ కంటి ఆరోగ్యాన్ని రక్షించి కంటి చూపును మెరుగుపరుస్తుంది. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు, అధిక బరువు సమస్యతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తింటే వీటిలో పుష్కలంగా ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను పెంచడంతోపాటు కొలెస్ట్రాల్ అధికం చేస్తాయి. అందుకే ఇలాంటివారు తక్కువగా తింటే ఎటువంటి ప్రమాదం ఉండదు.