సపోటా పండ్లను మన రోజువారి ఆహారంలో తీసుకోవచ్చా? ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది?

సపోటా పండ్లలో మన రోజువారి జీవక్రియలకు అవసరమైన అన్ని పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. సపోటా పండ్లలో సహజ తీపి గుణం ఎక్కువగా ఉండి అందరిని ఆకర్షిస్తుంది. అయితే కొందరు మాత్రం సపోటా పండ్లులో సుక్రోజ్ పరిమాణం ఎక్కువగా ఉంటుందని వీటిని ఆహారంగా తీసుకుంటే చక్కర వ్యాధి, ఉబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయని వీటిని తినడానికి సంకోచిస్తుంటారు. వీరి ఆలోచన సరైనది కాదని చెప్పొచ్చు. ఎందుకంటే సపోటా పండ్లు లో ఉన్న సహజ సిద్ధమైన సుక్రోజ్ గుణాలు మన శరీరానికి తగిన శక్తిని ఇవ్వడంతో పాటు రోజువారీ కార్యకలాపాల్లో మనల్ని చురుగ్గా ఉంచుతుంది.

అయితే సపోటా పండ్లలో సుక్రోస్ పరిమాణం కాస్త ఎక్కువగా ఉంటుంది అనేది వాస్తవమే. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు, అతి బరువు సమస్యతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజుకు ఒక్క పండు తింటే ఎటువంటి హాని జరగదు. కావున సపోటా పండ్లను మన రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సపోటా పండ్లలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ బి కాంప్లెక్స్ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే కంటి సమస్యలు చర్మ సమస్యలు తొలగిపోవడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.

సపోటా పండ్లు క్యాల్షియం, మెగ్నీషియం ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల వయసు మళ్లిన తర్వాత వచ్చే ఆర్థరైటిస్ ఆస్తియోఫోరోసిస్ వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. ఈ పండ్లలో సమృద్ధిగా ఉన్న మెగ్నీషియం, పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి అధిక రక్తపోటు సమస్యను నియంత్రిస్తుంది. మెగ్నీషియం మెదడు కణాలను శాంతపరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సపోటా పండ్లలో పుష్కలంగా ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి జీర్ణ క్రియ రేటును పెంచి మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తాయి. శరీరంలో వ్యాధికారక క్రిములతో సమృద్ధిగా పోరాడి అనేక ఇన్ఫెక్షన్లతో పాటు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో ఎంతో సహాయపడుతుంది.