సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఎన్నో జాగ్రత్తలు పాటించాలని చెబుతుంటారు. ముఖ్యంగా ఆహార విషయంలో గర్భిణీ స్త్రీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఇలా గర్భం దాల్చిన మహిళలు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గర్భస్రావం కలుగుతుంది అని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా బొప్పాయి తినడం వల్ల గర్భస్రావంఅయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయని ఇంట్లో పెద్దవాళ్లు గర్భిణీ స్త్రీలకు సూచిస్తూ ఉంటారు మరి నిజంగానే బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందా నిపుణులు ఏమంటున్నారు అనే విషయానికి వస్తే…
మహిళలకు గర్భధారణ సమయంలో ప్రోటీన్లు పోషకాలు ఎంతో అవసరం అయితే బొప్పాయి పండులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.బొప్పాయిలో బీటా కెరోటిన్, కోలిన్ ఫైబర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు ఎ, బి,సి పుష్కలంగా గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.అయితే పూర్తిగా మాగిన బొప్పాయి పండును తిన్నప్పుడు ఏ విధమైనటువంటి గర్భస్రావం కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాకాకుండా పచ్చి బొప్పాయి పండు తినడం వల్ల కొందరిలో గర్భస్రావం అయ్యే సూచనలు ఉంటాయి.
పచ్చి బొప్పాయిలో ఎక్కువగా లేటెక్స్ ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. పచ్చి బొప్పాయి తినడం వల్ల లేటెస్ట్ అనే పదార్థం కారణంగా గర్భస్రావం అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి కనుక పచ్చి బొప్పాయి కి దూరంగా ఉండడం ఎంతో మంచిది. వీటితోపాటు నల్లని ద్రాక్ష కూడా తినకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.ద్రాక్షలో రెస్వెరాట్రాల్ ఉంటుంది. దీనితోపాటు పైనాపిల్ కూడా గర్భిణీ స్త్రీలు తినకపోవడం ఎంతో మంచిది.