జీర్ణ వ్యవస్థలోపాలు, డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినొచ్చా ? తింటే ఏమవుతుంది?

అత్యధిక పోషక విలువలు కలిగిన ఖర్జూరం మరియు ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ను రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఐరన్, ఫైబర్ పొటాషియం, సహజ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ను అభివృద్ధి చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎండు ద్రాక్ష ఖర్జూరం కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మన ఆరోగ్య పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను అనుగుణంగా వీటిని ఆహారంగా తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వైద్యుల సూచనల ప్రకారం శీతాకాలంలో జీర్ణ క్రియ రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎండు ద్రాక్షను మరియు ఖర్జూర పండ్లను మోతాదుకు మించి తింటే జీర్ణశక్తి మరింత క్షీణించి డయేరియా, అజీర్తి, కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఖర్జూర పండ్లను అతిగా తింటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి ఆస్తమా సమస్య తలెత్తుతుంది. ఎండుద్రాక్షను, ఖర్జూర పండ్లను మోతాదుకు మించి ఆహారంగా తీసుకుంటే శరీరంలో కేలరీలు అధికం అయ్యి శరీర బరువు పెరిగి ఉబకాయ సమస్య తలెత్తవచ్చు.

ముఖ్యంగా చక్కెర వ్యాధి నియంత్రణలో లేనివారు ఖర్జూర పండ్లను, ఎండు ద్రాక్షను మోతాదుకు మించి ఆహారంగా తీసుకుంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్, క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభ్యమవుతాయి కావున రక్తంలో గ్లూకోజ్ నిల్వలు ప్రమాదకరస్థాయిలో పెరిగి చక్కెర వ్యాధి తీవ్రత మరింత కలవర పెట్టవచ్చు. ఎండు ద్రాక్షను ఎక్కువగా తినడం వల్ల లివర్ పనితీరు మందగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని ద్వారా మనం తిన్న ఆహారం జీర్ణం అవడంలో సమస్యలు తలెత్తి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఎండు ద్రాక్షను ఖర్జూర పండ్లను పరిమితంగా తీసుకుంటే మనలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మోతాదుకు మించి తింటే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.